YCP Social Media

ఒక్కోసారి వైసీపీ చేస్తున్న రాజకీయం చూస్తున్నా, ఆ పార్టీ నేతలు చేసే ప్రచారాలు వింటున్నా సిగ్గు కూడా సిగ్గుతో తలవంచుకునేలా ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకతీరు, ప్రతిపక్షంలోకి వస్తే మరో లెక్క అన్నట్టుగా వైసీపీ రాజకీయం నడుస్తూ ఉంటుంది.

గత వైసీపీ పాలనలో సినిమా టికెట్ రేట్ల పంచాయితీలో తగ్గేంచాల్సిందే అంటూ పట్టు పట్టిన వైసీపీ ఇప్పుడు మాత్రం తగ్గేదెలా అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కు మద్దతుగా నంద్యాల వచ్చిన అల్లు అర్జున్ కు మెగా అభిమానులకు మధ్య ఏర్పడిన దూరాన్ని తమ రాజకీయం కోసం వాడుకుంటున్నారు వైసీపీ నేతలు.

Also Read – M9 పాఠకులకు ‘భోగి’ పండుగ శుభాకాంక్షలు..!

2021 డిసెంబర్ 17 న దేశ వ్యాప్తంగా విడుదలైన పుష్ప -1 బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గేదెలా అన్నట్టుగా దూసుకుపోయింది, కానీ ఒక్క ఏపీలో మాత్రం వైసీపీ సర్కార్ తీసుకున్న టికెట్ రేట్ల తగ్గింపు నిర్ణయంతో తగ్గాల్సి వచ్చింది. అయినా కూడా బన్నీ 2024 ఎన్నికల సమయంలో వైసీపీ కి మద్దతుగా తన స్నేహితుడి కోసం ముందుకొచ్చారు.

ఈ నేపథ్యంలో అటు కూటమి మద్దతుదారులతో పాటుగా ఇటు మెగా అభిమానులు కూడా బన్నీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైన పుష్ప -2 కోసం అటు తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా ఇటు ఏపీ ప్రభుత్వం కూడా చిత్ర బృందం కోరిన మేరకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించాయి. అయితే ఈ రేట్ల పెంపు విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

Also Read – సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.. మరిచిపోకండి సార్లూ

అనూహ్యంగా వైసీపీ నేతలు పుష్ప ఫ్లెక్సీల మీద జగన్ బొమ్మలు ముద్రించి అప్పుడు “మా కోసం నువ్వు వచ్చావ్…ఇప్పుడు నీ కోసం మేము వస్తాం…తగ్గేదెలా” అంటూ పోస్టర్లు పెట్టి పుష్ప సినిమాకు వైసీపీ మద్దతు ఉంటుందని ప్రచారం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం లో సైతం వైసీపీ నేతలు ఈ తరహా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి జనసైనికులను, మెగా అభిమానులను రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తున్నారు.




అయితే గతంలో హీరోలకు వందల కోట్ల రెమ్యూనిరేషన్లు ఇవ్వడం ఎందుకు, ఆభారం ప్రేక్షకుల మీద రుద్దడం ఏమిటి.? సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలి కదా అంటూ వాదించి టికెట్ రేట్లను అమాంతం ‘తగ్గించి’న వైసీపీ ఇప్పుడు మాత్రం ‘తగ్గేదెలా’ అంటూ దూకుడుగా ముందుకు రావడంతో వైసీపీ రాజకీయ అవసరానికి సొంత చెల్లి, తల్లే తట్టుకోలేకపోయారు ఇక సినిమా నటులు ఎలా భరిస్తారు అంటూ బన్నీ కి సూచనలు వస్తున్నాయి.

Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?