Chandrababu Naidu

రాజకీయ సంబంధాలు, కారణాలు, అవసరాల వల్ల ఏపీలో వైసీపీ, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీలు ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ విజయం సాధించాలని కోరుకోగా, బీజేపి గెలవాలని టీడీపీ, జనసేనలు కోరుకున్నాయి. కనుక బీజేపి గెలుపు,ఆమాద్మీ పార్టీ ఓటమి కొందరికి సంతోషం, కొందరికి బాధ కలిగించడం సహజం.

బిఆర్ఎస్, ఆమాద్మీ, డియంకే, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలతో భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేసీఆర్‌, కేటీఆర్‌ జోస్యం చెప్పారు. కానీ ఆయన జోస్యం పదేపదే తప్పుతోంది.

Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..

ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ ఓటమి ప్రభావం తెలంగాణ రాజకీయాలపై తప్పక ఉంటుంది. బిఆర్ఎస్ పార్టీకి మూల స్థంభాలవంటి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు, కవిత నలుగురిపై పలు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ వారిపై చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి జంకుతున్నారు. కేసీఆర్‌ని ఓడగొట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు కానీ నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తడబడుతూనే ఉంది. కనుక తెలంగాణలో మళ్ళీ బీజేపి బలపడేందుకు చాలా సానుకూల వాతావరణం నెలకొని ఉంది.

ఢిల్లీ పీఠం దక్కించుకునేందుకు బీజేపి గజినీ మహమ్మద్‌లా అలుపెరుగని పోరాటాలు చేసి ఎట్టకేలకు విజయం సాధించింది. కనుక అదే స్పూర్తితో ఇకపై తెలంగాణలో బీజేపిని బలోపేతం చేసుకొని మళ్ళీ రెండో స్థానంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయం. కనుక తెలంగాణలో మళ్ళీ మూడు ముక్కలాట మొదలవవచ్చు.

Also Read – అవినీతిని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటున్నారుగా!

ఇక ఏపీలో జగన్‌, వైసీపీ నేతలు, వారి సొంత మీడియా సిఎం చంద్రబాబు నాయుడుపై బురదజల్లి అప్రదిష్టపాలు చేయాలని ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, చంద్రబాబు నాయుడు ప్రతిష్ట అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నిధులు విడుదల చేస్తుండటం, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు బ్రేకులు వేయించడం, లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటవుతుండటం, విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు, ఇంకా పలు రైల్, రోడ్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం సిఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టని ఇంకా పెంచేవే.

Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!

ఢిల్లీ ఎన్నికల బీజేపి విజయం సాధించడంతో ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనందుకు సిఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్ట, ప్రాధాన్యం మరింత పెరిగింది. ఎక్కడో ఢిల్లీలో ఎన్నికలు జరిగితే వాటి వలన కూడా సిఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్ట పెరిగితే జగన్‌కి మరింత కడుపు మంట కలగకుండా ఉంటుందా?

అయితే చంద్రబాబు నాయుడుని తిట్టిపోసి ఆ కడుపు మంట ఎలాగో చల్లార్చుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఒత్తిడికి కేంద్రం తలొగ్గి కేసుల విచారణ వేగవంతం చేస్తే?ఇంకా ప్రమాదం. బహుశః ఇందుకోసమే ఏ-2 విజయసాయి ముందే తప్పుకున్నారా?ఏదో జరుగబోతోంది గాబట్టే షర్మిలతో చేతులు కలిపారా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఢిల్లీలో ఎన్నికలు జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో ఏదో జరిగితే తుంటి మీద కొడితే మూతిపళ్ళు రాలిన్నట్లే కదా?