విజయవాడలో కృష్ణమ్మ శాంతించగానే ఉభయ గోదావరి జిల్లాలపై గోదారమ్మ విరుచుకు పడుతోంది. కృష్ణానదిలో ఈసారి రికార్డ్ స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల నీళ్ళు ప్రవహించగా, రాజమండ్రిలో ధవళేశ్వరం బ్యారేజీ గుండా 13.27 లక్షల క్యూసెక్కుల నీళ్ళు ప్రవహిస్తున్నాయంటే వరద ఉదృతి ఏ స్థాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చు.
Also Read – జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ Vs మెగా ఫాన్స్ – ఎవరికి ఉపయోగం??
మంగళవారం ఉదయం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికని జారీ చేశారు.
ధళేశ్వరం బ్యారేజీకి ఉన్న 175 గేట్లని ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో దిగువన గల తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో పలు గ్రామాలు ముంపుకి గురయ్యాయి.
Also Read – విశ్వంభర VFX ఎక్కడ తేడా కొట్టింది?
ఆలమూరు, సీతానగరం, రాజమండ్రి అర్బన్ మండలాలో లంక గ్రామాలన్నీ జల దిగ్బందంలో చిక్కుకోవడంతో మరబోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అల్లూరి జిల్లాలో శబరి, సీలేరు ఉప నదులు, చీకటివాగు, సోకిలేరు వాగు, కుయుగూరు వాగు, చంద్రవంక వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో చింతూరు మండలంలో 22 గ్రామాలు జల దిగ్బందంలో చిక్కుకున్నాయి.
Also Read – జగన్ ఇంకా కాంగ్రెస్‌వైపు చూస్తూనే ఉన్నారా?
ఏలూరు జిల్లాలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 12 గ్రామాలు జల దిగ్బందంలో చిక్కుకున్నాయి. కొల్లేరులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఏలూరు రూరల్, కైకలూరు, మండవల్లి, పెదపారు, ఆకివీడు, ఉంగుటూరు, దెందులూరు మండలలోని గ్రామాలలోకి నీళ్ళు చేరుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏలూరు-కైకలూరు ప్రధాన రహదారిపై నుంచి వరద నీళ్ళు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఏలేరు పొంగి ప్రవహిస్తూ కాకినాడ జిల్లాని ముంచెత్తుతోంది. జిల్లాలో 62,505 ఎకరాలలో పంటలు నీట మునుగగా, పిఠాపురం-సామర్లకోట, పిఠాపురం-రాపర్తి, గొల్లప్రోలు-భోగాపురం, పెద్దాపురం-గుడివాడ రోడ్లన్నీ నీట మునిగడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
బుధవారం ఉదయానికి ఏలేరు జలాశయానికి వరద ఉదృతి తగ్గింది. కానీ వరదలతో ఒక్క కిర్లంపూడి మండలంలోనే ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. దాంతో పచ్చటి పొలాలన్నీ నీట మునిగాయి.
విజయవాడ వరద కష్టాలు తీరక మునుపే ఉభయ గోదావరి జిల్లాలను వరదలు ముంచెత్తడంతో ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారింది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ల అధ్వర్యంలో పోలీసులు, సహాయ సిబ్బంది భారీగా ఎత్తున సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్నారు.
కృష్ణ, గోదావరి వరదలతో జరిగిన నష్టాన్ని ఏదో విదంగా పూడ్చుకోవచ్చు. కానీ ఈ ప్రకృతి విపత్తులకు ప్రభుత్వం శాశ్విత పరిష్కారం చేయాల్సిన అవసరాన్ని ఈ వరదలు మరోసారి గుర్తుచేస్తున్నాయి. అప్పుడే ఏటా ఈ సమస్యలు పునరావృతం కాకుండా నివారించవచ్చు.