ysjagan-

2024 ఎన్నికలలో గెలుపు కోసం వైసీపీ ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని తొక్కేసింది. ప్రత్యర్థి బలం మీద కొట్టి నెగ్గడం ఒక రకమైన రాజకీయం అయితే వారి బలహీనతను అడ్డుపెట్టుకుని దెబ్బ తీయడం మరో రకం రాజకీయం. అయితే ఒకటి విలువలతో కూడిన రాజకీయ అయితే మరొకటి విధ్వంసంతో కూడిన రాజకీయం.

వైసీపీ ఎప్పుడైనా టైపు టూ పాలిటిక్స్ నే నమ్ముకుంటుంది కాబట్టి రెండో రకం రాజకీయానికి తెరలేపింది. తండ్రి వైస్సార్ పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమాను తెరకెక్కించి 2019 ఎన్నికలలో ఒక్క ఛాన్స్ కు మార్గం సులభం చేసుకున్నారు జగన్. సరిగ్గా మళ్ళీ ఐదేళ్ల తరువాత ఎన్నికలకు రెండు నెలల ముందు జగన్ చేసిన పాదయాత్ర ను యాత్ర – 2 పేరుతో వెండి తెర మీద ఆవిష్కరించారు.

Also Read – బెంగళూరు ఐ‌టి కంపెనీలకు ఏపీ స్వాగతం పలుకుతోంది

అయితే యాత్ర 2 తో జగన్ కు ముఖ్యమంత్రిగా ఏపీ ప్రజానీకం రెండో ఛాన్స్ ఇస్తారు అనుకున్న జగన్ కు రెండో ఛాన్స్ మాట అటుంచితే సినిమా రెండు రోజులు కూడా థియేటర్లలో నిలబడలేకపోయింది. అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ లను టార్గెట్ చేస్తూ వైసీపీ ఆస్థాన దర్శకుడు ఆర్జీవీ దర్శకత్వం తో వ్యూహం పేరుతో రెండు, శపధం పేరు తో ఒక సినిమా విడుదలయ్యింది.

అయితే ఆ సినిమాలు వచ్చాయి వెళ్లాయి అనే సంగతి కూడా రాష్ట్రంలో చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా టికెట్ కొని థియేటర్లకు వెళ్లే సాహసం చెయ్యకపోవడం ఈ వ్యూహం, శపధం సినిమాలకు హైలైట్ గా నిలిచింది. వ్యూహాలతో టీడీపీ చరిత్ర ముగిసి పోతుంది అంటూ శపధాలు చేసిన వైసీపీ నేతల చరిత్రలు కూటమి సునామీకి కొట్టుకుపోయాయి.

Also Read – రోజా రోజమ్మ…ఆనాటి హగ్గులు ఏవమ్మా..?

తమకు అనుకూలంగా కొన్ని, ప్రతిపక్షాలను కించపరుస్తూ మరికొన్ని సినిమాలు తీసి ఏపీ ఓటర్లను మరోసారి వైసీపీ ఫ్యాన్ కిందకు రప్పించాలని భావించిన జగన్ కు 151 సీట్లతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన వైసీపీ ఫ్యాన్ స్పీడ్ ను 11 తగ్గించి కంట్రోల్లో పెట్టారు ఓటర్లు. అలాగే సిద్ధం…మేమంతా సిద్ధం అంటూ కొన్ని వందల కోట్లు ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు చేశారు జగన్.

అయితే జగన్ సభలకు లక్షల్లో ప్రజలు హాజరైతే వారంతా వైసీపీ ఓటు బ్యాంకు గా భావించారు జగన్ అండ్ కో. అయితే అసలు జగన్ సభలకు వేలల్లో జనాభా వస్తే వాటికి గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ జత చేసి నీలి మీడియా లక్షల్లోకి మార్చిందనే ఒక ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీకి వచ్చిన సీట్ల సంఖ్యను చూస్తే అదే నిజమని రుజువయ్యింది.

Also Read – పద్మనాభ రెడ్డికి అంబటి అభినందనలు… శభాష్!

ఓటమికి కారణాలు శోధిస్తున్న జగన్ అమ్మ ఒడి తీసుకున్న అక్క చెల్లెమ్మలు ఓట్లు ఎటుపోయాయో, చేయూత తీసుకున్న లబ్ధిదారుల ఓట్లు ఎటుపోయాయి, రైతుబంధు పొందిన రైతుల ఓట్లు ఏమైపోయాయి అంటూ ప్రజలను నిందిస్తున్నారే తప్ప తమ ప్రభుత్వం చేసిన తప్పిదాలను గుర్తించలేకపోతున్నారు. దీనితో మీరు తీసిన వ్యూహాలు ఏమయ్యాయి.? మీరు చేసిన గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ ఫలితాలు ఎక్కడా.? అంటూ వైసీపీ కి ఎదురు ప్రశ్నలు మొదలయ్యాయి.