తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం మొదలు కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా వరకు అన్నిటి మూలాలు తాడేపల్లి ప్యాలస్‌లోనే బయటపడుతున్నాయి. ఏ తీగ కదిలినా తాడేపల్లి ప్యాలస్ డొంక కదులుతోంది.
Also Read – అందరికీ పంచింగ్ బ్యాగ్ మన టాలీవుడ్?
కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా ఓ అతిపెద్ద అధ్యాయం. ఇంతవరకు ప్రభుత్వమే దాని మూలాల వరకు వెళ్ళలేకపోయింది. కనుక ఇప్పుడు ఆ భాగోతం గురించి చెప్పుకోవడం అంటే పుష్ప-3 స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లే ఉంటుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, స్థలాలు, పొలాలు, ఇళ్ళు కబ్జాలు చేయడం గురించి విన్నాము. కానీ ఏకంగా ఓ పోర్టునే కబ్జా చేయడం గురించి తొలిసారిగా వింటున్నాము. అదెలా అంటే..
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా చేయాలంటే ముందుగా 41.12 శాతం వాటాలున్న కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలను స్వాధీనం చేసుకోవలసి ఉంటుందని జగన్ గ్రహించారు.
కుక్కని చంపాలంటే ముందుగా దానిపై ‘పిచ్చి కుక్క’ అని ముద్రవేయాలన్నట్లు, ఆ రెండు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.965.65 కోట్లు పన్ను ఎగవేసిననట్లు ఆడిట్ రిపోర్ట్ తయారు చేయించారు.
Also Read – సైఫ్‌కి టాలీవుడ్ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?
ఆ తర్వాత వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్ రెడ్డి రంగ ప్రవేశం చేశారు. ఆ తప్పుడు ఆడిట్ రిపోర్టుని చూపించి రెండు సంస్థల డైరెక్టర్లను, వారి కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేయించి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తామని, వారి వ్యాపారాలన్నీ మూయించేస్తామని బెదిరించి, భయపెట్టారు.
ఆవిదంగా వారిని బెదిరించి రూ.2,500 కోట్లు విలువైన కాకినాడ సీపోర్టులో వాటాలను కేవలం రూ.494 కోట్లకు, రూ.1,109 కోట్లు విలువైన కాకినాడ సెజ్‌లోని వాటాలను కేవలం 12 కోట్లు బలవంతంగా అరబిందో సంస్థకు బదిలీ చేయించుకున్నారు.
ఆవిదంగా కాకినాడ పోర్టుని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత అక్కడి నుంచి గత 5 ఏళ్ళలో సుమారు కోటి టన్నులు రేషన్ బియ్యం ఆఫ్రికా దేశాలకు అక్రమంగా రవాణా చేశారు. కనుక ఈ కాకినాడ పోర్టు కధ, రేషన్ బియ్యం అక్రమ రవాణా రెండు వేర్వేరు ఎపిసోడ్స్.
Also Read – ఈ విందుని జగన్ జీర్ణించుకోలేరేమో?
ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోర్టులో తనికీలు చేసి అక్కడ జరుగుతున్న ఈ భాగోతం అంతా బయటపెట్టే వరకు కూడా సదరు కంపెనీ డైరెక్టర్ కర్నాటి వెంకటేశ్వరావు తదితర జగన్ బాధితులకు పోలీసులకు పిర్యాదు చేసేందుకు ధైర్యం రాలేదంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
ఎట్టకేలకు వారు ధైర్యం చేసి పోలీసులకు పిర్యాదు చేయడంతో కాకినాడ పోర్టుని, దానికి అనుబందంగా పొన్నాడ, మూలపేట, రామనక్క పేటలో గల 8,320 ఎకరాల విస్తీర్ణం కలిగిన కాకినాడ సెజ్‌ని జగన్, బంధువులు ఏవిదంగా స్వాధీనం చేసుకున్నారో బయటపడింది.
వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలను గుర్తించి వెలికి తీసి చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం ఉన్న వ్యవస్థల సామర్ధ్యం ఏమాత్రం సరిపోదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో ప్రవేశించడానికే అనేక అవరోధాలు ఎదుర్కోవడం, అక్కడి అధికారులు, సిబ్బంది సహాయ నిరాకరణ చేయడం గమినిస్తే ప్రస్తుతం ఉన్న వ్యవస్థలు, యంత్రాంగం సరిపోదని స్పష్టమవుతోంది.
కనుక వీటన్నిటి కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన హైడ్రా వంటి ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. లేకుంటే వైసీపీ అవినీతి జాబితాని డైరీలో రాసుకోవడానికే 5 ఏళ్ళ సమయం సరిపోవచ్చు.