YS Jagan Mark Politics

వైసీపీ అధినేత జగన్‌ రాజకీయాలు చేయడమంటే కుట్రలు, కుతంత్రాలు చేయడమని గట్టిగా నమ్ముతారు. ఐదేళ్ళ పాలనలో అలాగే రాజకీయాలు చేశారు. కనుక అందరూ తనలాగే కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారని భావిస్తూ తీవ్ర అభద్రతాభావంతో 5 ఏళ్ళు పరదాలు మాటున, బ్యారీకేడ్ల మాటున గడిపేశారు.

అదే సమయంలో జగన్‌ వేధింపులు తట్టుకొని భరిస్తూ చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏవిదంగా పోరాటాలు చేశారో అందరూ చూశారు. వారి పోరాటాలతో ప్రజలలో చైతన్యం కలిగించి ఎన్నికలలో వైసీపీని ఓడించి జగన్‌ని గద్దె దించారు. వైసీపీ, టీడీపీ రాజకీయాలు చేసే విధానంలో ఇంత తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read – కిరణ్..కళ్యాణ్ మాదిరి స్వరం మారుస్తారా.?

వైసీపీ ఓడిపోయిన తర్వాత, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటి రాజకీయాల స్టైల్ మారలేదు. నేటికీ అలాగే సాగుతోంది.

చంద్రబాబు నాయుడు ప్రతీకారాలు, రాజకీయ కక్షలు పట్టించుకోకుండా రాష్ట్రాభివృధ్దిపై, పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. రాజకీయాలు రాష్ట్రాభివృద్ధికని గట్టిగా నమ్ముతున్నారు.

Also Read – రాజకీయాలలో కొత్త ట్రెండ్.. ఇది అందరికీ ప్రమాదమే!

జగన్‌ ఎప్పటిలాగే తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని, కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టి టీడీపీ, జనసేనలను విడగొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఏదో విధంగా వాటి మద్య చిచ్చుపెట్టి జనసేన బయటకు వచ్చేలా చేయగలిగితే చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కూలిపోతుందని, ఎన్నికలొస్తే తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవచ్చని జగన్‌ కలలు కంటున్నారు.

Also Read – చూస్తుండగానే 8 నెలలు.. సమయం తక్కువ ఉంది మిత్రమా!

మొదట నారా లోకేష్‌, పవన్ కళ్యాణ్‌ల మద్య చిచ్చు రగిలించాలని ప్రయత్నించారు. కుదరకపోవడంతో హోం మంత్రి అనిత వంగలపూడి, పవన్ కళ్యాణ్‌ మద్య చిచ్చు రగిలించే ప్రయత్నం చేశారు. కానీ అదీ వర్కవుట్ కాలేదు.

శనివారం మైదుకూరు సభలో టీడీపీ సీనియర్ నేత శ్రీనివాస్ రెడ్డి, ‘నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని’ కోరారు.

ఇప్పుడు ఆ మాట పట్టుకొని జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ సొంత మీడియా మరో కొత్త స్టోరీ వండి వార్చేసింది.

ఈవిదంగా దొరికిన ప్రతీ అవకాశాన్ని తెలివిగా వాడుకుంటూ కూటమిలో చిచ్చు పెట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటే ఏదోరోజు తమ ప్రయత్నం ఫలించి జనసేన కూటమి నుంచి బయటకు వస్తుందని జగన్‌ గట్టిగా నమ్ముతున్నారు. కనుక గజినీ, గోరీ మహమ్మద్‌లా ప్రయత్నిస్తూనే ఉన్నారు.




కానీ పాము, కత్తి, తుపాకీ, నిప్పుతో ఆటలు ఆడేవారు వాటికే బలైపోయిన్నట్లు, ఇటువంటి జగన్‌-మార్క్ రాజకీయాలకు వైసీపీయే బలైపోతుంది.. అని ఇప్పటికే నిరూపితమైంది. మళ్ళీ మళ్ళీ నిరూపిస్తూనే ఉంటారేమో?