YS Jagan Own Style Of Politics

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు తనకు నచ్చిన్నట్లు రాజకీయాలు చేయాలని ఆశించేవారు. టీడీపీ-జనసేనల పొత్తులు పెట్టుకోకూడదని చెప్పేవారు. పెట్టుకుంటే అది రాజకీయ వ్యభిచారమే అని వాదించేవారు.

Also Read – కుమారస్వామికి అలా పుణ్య ఫలం దక్కింది!

కానీ అవి తన అభీష్టానికి వ్యతిరేకంగా పొత్తులు పెట్టుకునందున వాటి మద్య చిచ్చు పెట్టి విడగొట్టేందుకు జగన్‌ చేసిన విఫలయత్నాలు అందరూ చూశారు.

అప్పుడు పవన్ కళ్యాణ్‌ స్పందిస్తూ “జగన్‌ చెప్పిననట్లు నడుచుకునే మాటయితే ఇంక ప్రతిపక్షాలు ఎందుకు?మేము ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతోనే పొత్తులు పెట్టుకున్నాము,” అని ఘాటుగా బదులిచ్చారు.

Also Read – కోటి సభ్యత్వాలు: ఎన్టీఆర్‌కి ఇదే కదా నివాళి?

జగన్‌ ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారినప్పటికీ, కూటమి ప్రభుత్వం తను కోరుకున్నట్లే నడవాలని ఆశిస్తున్నారు. తాను అమలుచేసిన సంక్షేమ పధకాలను కూటమి ప్రభుత్వం యధాతధంగా అమలు చేయాలని, పవన్ కళ్యాణ్‌ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వాన్ని కూల్చేయాలని జగన్‌ కోరుకుంటున్నారు.

ఎన్నికలలో వైసీపీ ఓడిపోయింది కనుక దేశంలో ఈవీఎంలను పక్కన పడేసి మళ్ళీ బ్యాలెట్ ఎన్నికల పద్దతికి మారాలని జగన్‌ డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఆలోచనలు జగన్‌కు తప్పుగా అనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!

తాడేపల్లి ప్యాలస్‌ తాజా సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు తనని, తన పార్టీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. నెలకో కొత్త అంశం తెరపైకి తీసుకువచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు.

అధికార పార్టీని, ప్రభుత్వ విధానాలను ప్రతిపక్షాలు విమర్శించడం సహజమే. కనుక జగన్‌ విమర్శలు కూడా సహజమే అని సరిపెట్టుకోవచ్చు.

కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్‌-నారా లోకేష్‌ మద్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తూ, టీడీపీ, జనసేనలు మాత్రం బుద్ధిగా రాజకీయాలు చేయాలని జగన్‌ ఆశించడం విడ్డూరంగా ఉంది కదా?

కూటమి ప్రభుత్వంలో చిచ్చుపెట్టి కుప్పకూలిపోయేలా చేస్తే తాను అధికారంలోకి రావచ్చని జగన్‌ భావిస్తున్నప్పుడు, సిఎం చంద్రబాబు నాయుడు చేతులు ముడుచుకొని కూర్చోవాలా?

తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని జగన్‌ చేస్తున్న కుట్రలకు తన ప్రభుత్వం బలైపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత సిఎం చంద్రబాబు నాయుడుపై ఉంటుంది కదా?

గతంలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని గ్రహించినప్పుడు వారు ఎటువంటి రాజకీయాలు చేశారో అందరూ చూశారు కదా?

కనుక సిఎం చంద్రబాబు నాయుడు కూడా జగన్‌ వ్యూహాలకు ఎప్పటికప్పుడు ప్రతి వ్యూహాలు అమలు చేయకుండా ఉంటారా?ఉండాలని ఎలా కోరుకొంటున్నారు?అంటే జగన్‌ రాచరిక, నియంతృత్వ పోకడలు, దూరాశ వల్లనే అని చెప్పవచ్చు.

వైసీపీ శ్రేణులు, వారి అధినేత జగన్‌ రాజకీయంగా యాక్టివ్ కాబోతున్న ఈ సమయంలో వారి నైతిక స్థయిర్యం దెబ్బ తీసేందుకే అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్‌ల చేత రాజీనామాలు చేయించారని చెప్పుకోవడం సిగ్గుచేటు.

అయినా పార్టీలో సీనియర్లు బయటకు వెళ్ళిపోతుంటే వారికి నచ్చజెప్పి కాపాడుకోలేక, దానికీ సిఎం చంద్రబాబు నాయుడుని, టీడీపీని నిందిస్తుండటం సిగ్గుచేటు కాదా?