roja-selvamani-jagan-kodali-nani

జూన్ 12 న నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కూటమి శాసన సభాపక్ష నేత నారా చంద్రబాబు ముందు ఎన్నో సవాళ్లు ఎదురు చూస్తున్నాయి. ఇన్నాళ్ళుగా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఒక్కటే గాడి తప్పింది అని భావించిన వారందరికీ ఇప్పుడు ఏ వ్యవస్థ గాడిలో ఉందో అర్ధం కానీ పరిస్థితి.

నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నిటినీ విధ్వంసం చేసిందనే చెప్పాలి. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. వైసీపీ ప్రభుత్వం సంస్కరణలపేరుతో ఒక్కో వ్యవస్థను లూటీ చేసింది. ఇసుక నుండి మద్యం వరకు, ఆరోగ్యం నుండి ఆహరం వరకు అన్ని శాఖలలోను కొన్ని వేల కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం పై ఆధారాలతో కూడిన ఆరోపణలు చేస్తుంది.

Also Read – బాధ్యతకు…బరితెగింపుకు వ్యత్యాసం..!

అయితే విచిత్రంగా ప్రభుత్వ పెద్దలు చేసున్న ఈ ఆరోపణలను ఖండించడానికి కానీ అవి అవాస్తవమని వివరణ ఇవ్వడానికి కానీ గత ప్రభుత్వ మాజీ లెవ్వరు ప్రజల ముందుకు రావడం లేదు. దీనితో మోనం అర్ధాంగీకారం అనే సామెత గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఒక్క ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన కార్యక్రమంలోనే అప్పటి టూరిజం మంత్రి నగరి రోజా, బై రెడ్డి సిద్దార్ధ్ రెడ్డి కొన్ని వందల కోట్లు వెనకేసుకున్నారనీ ఆరోపిస్తున్నారు ఇప్పటి మంత్రులు.

గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినప్పుడు టపాసులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్న రోజా ఇప్పుడు అదే జైలుకు వెళ్ళడానికి సిద్దమవుతున్నారంటూ టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్టున్నారు. అలాగే గత ప్రభుత్వం అమలు చేసిన లిక్కర్ పాలసీలో వేల కోట్ల అవినీతి బయటపడబోతుందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ బేవరేజెస్ ఎండి వాసుదేవ రెడ్డి ఇంటి పై సోదాలు జరపగా అక్రమ సంపాదన పేరుతో 60 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Also Read – ఈ వయసులో డీఎన్ఏ టెస్ట్… ఇబ్బందే!

ఈ ఐదేళ్ళుగా వైసీపీ ప్రభుత్వంలో మందుబాబుల ప్రాణాలు తీసిన మద్యం బ్రాండ్ల మీదకూడా విచారణ చేపట్టారు. అలాగే పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్యా, ఆన్ లైన్ క్లాసులు అంటూ బై జ్యూస్ తో చేసుకున్న ఒప్పందాలు, వారి నుంచి పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసిన టాప్ లు అన్ని కూడా “స్కీం ల పేరుతో జగన్ చేసిన స్కాం “లే అనేది మరి కొన్ని రోజులలో ప్రజల ముందు ఉంచనుంది కూటమి ప్రభుత్వం.

పేద వాడికి ఉచితంగా పంపిణి చేసే రేషన్ బియ్యం నుంచి పేద వాడి ఆరోగ్యం కోసం ఖర్చు చేసే ఆరోగ్య శ్రీ వరకు అన్నింటిలోనూ జగన్ అండ్ కో తమ చేతివాటం ప్రదర్శించడంతో గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర ఖజానాను లూటీ చేసిందా అని నివ్వెర పోతున్నారు. సలహాదారుల పేరుతో సాక్షి ఉద్యోగులను తీసుకు వచ్చి ప్రభుత్వ సొమ్మును జీతాలుగా ఇవ్వడం, పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి ప్రభుత్వ ఖజానాను నుండి బటన్ నొక్కడం అన్ని తన పార్టీ సౌలభ్యానికే అనేది స్పష్టమయిపోయింది.

Also Read – హైద్రాబాద్ వాసుల కష్టాలకు ఆయనే రావాలి..!

అలాగే ఈ ఎన్నికలు పేదవాడికి పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికలు అంటూ తనను తానూ పేదవాడిగా చెప్పుకున్న జగన్ తన కోసం తన కుటుంబం కోసం రుషికొండ మీద సుమారు 500 కోట్లు వెచ్చించి నిర్మించుకున్న భవనాలు చూస్తుంటే జగన్ లక్షల కోట్లు ఉన్న అతి పేదవాడా అనిపించకమానదు. ఒక్క ఏపీలో నే మూడు ప్యాలస్ లు నిర్మించుకున్న అతి పేదవాడు జగనే.

ఒక సెంటు స్థలం ఇచ్చి పేదవాడి సొంత ఇంటి కల తీర్చేసాం అని గొప్పలు చెప్పుకున్న జగన్ తానూ నివసించడానికి మాత్రం కొన్ని ఎకరాల స్థలాన్ని వినియోగించుకోవడం జగన్ జల్సా తనానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. రాష్ట్రం అప్పుల కుప్పలో కురుకుపోతూన్నా, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతున్నా జగన్ మాత్రం తన విలాసాలకు ఏమాత్రం లోటు లేకుండా చూసుకున్నారు. తన కోటరి మొత్తాన్ని ఉన్నత స్థాయి పదవులను సృష్టించి వారికీ లక్షల్లో జీతాలు కేటాయిస్తూ కొన్ని వేల కోట్లు లూటీ చేసారు జగన్.

తండ్రి లేని బిడ్డ, తండ్రి ఆశయాల కోసం పని చేయడానికి ఒక్క ఛాన్స్ కావాలి అంటూ ప్రజలను మభ్య పెట్టి అధికారాన్ని అందుకున్న జగన్ ఆ ఒక్క ఛాన్స్ తో తనకు చేతకాని పాలనతో ముఖ్యమంత్రిగా లేకుండా ఒక వ్యాపార వేత్తగా భావించి తనకు ఆదాయం వచ్చే మార్గాలను మాత్రమే అన్వేషిస్తూ రాష్ట్రాన్ని మరో పదేళ్లు వెనక్కి నెట్టారు. ఈ ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో జగన్ అండ్ కో చేసింది పాలన కాదు లూటీ అని అర్ధమయ్యే సరికే రాష్ట్రానికి జరగాల్సిన భారీ నష్టం జరిగిపోయింది.
అయినా ఓటమిని అంగీకరించని బాబు, సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎన్నడూ వెనుకడుగు వేయని బాబు, రాష్ట్ర క్షేమం కోసం ఎంతైనా తగ్గగలను, ఎవరినైనా ఎదిరించగలను అనే ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేసే పవన్ నాటి రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్ది తిరిగి అన్ని వ్యవస్థలను గాడిలో పెడతారనే నమ్మకంతో ఓటేసిన ఏపీ ఓటర్ల ఆశలకు వారి భవిష్యత్తు తరాల భవిష్యత్తుకు ఈ ఐదేళ్లు ఎంతో కీలకం గా మారింది. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సొమ్మును లూటీ చేసిన ప్రతి నాయకుడు దగ్గర నుండి ప్రతి అధికారి దగ్గర నుండి ఆ సొమ్మును తిరిగి రాబట్టగలిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒక్క ఏడాదిలోనే గాడిలో పడిపోతుంది.