YS Jagan Supports Stone Pelting On TDP Central Office

జగన్‌కి ఇంకా పాస్‌పోర్ట్ రాకపోవడంతో లండన్‌ వెళ్ళలేకపోయారు. కనుక ఆలోగా విజయవాడ, గుంటూరులో పర్యటిస్తూ బురద రాజకీయాలు చేస్తున్నట్లున్నారు. బుధవారం జగన్‌ గుంటూరులో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చారు.

Also Read – ఆహా అనిపించిన బాలయ్య అన్ స్టాపబుల్…!

ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎంత రాజకీయ అజ్ఞాని అయినా బాజా బజంత్రీలతో ఊరేగుతూ పరామర్శకు వెళ్ళరు. కానీ జగన్‌ గుంటూరులో అడుగుపెట్టగానే వైసీపి నేతలు బాజాబజంత్రీలతో ఘనస్వాగతం చెప్పారు.

వైసీపి శ్రేణులు అధినేతకు బాజాబజంత్రీలతో స్వాగతం పలుకుతూ రోడ్డుపై చిందేస్తుంటే, అది చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. వారి ఉత్సాహం, హడావుడి చూస్తే వైసీపి ఎన్నికలలో గెలిచి, తొలిసారిగా జగన్‌ అక్కడికి వస్తే స్వాగతం పలికిన్నట్లుంది తప్ప వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన్నట్లనిపించదు.

Also Read – నేతి బీరకాయలో నెయ్యి… పాన్ ఇండియా మూవీలో తెలుగు!

అయితే వరద బాధితుల కంటే ముందు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్‌ని పరామర్శించడమే ముఖ్యం అనుకున్నారు జగన్‌. దానినీ తప్పు పట్టలేము.

కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి అనుచితంగా దూషించాడు. నన్ను నోటికి వచ్చిన్నట్లు తిడితే నన్ను, నా పార్టీని అభిమానించేవారికి మండదా? అందుకే కొందరు టిడిపి కార్యాలయంపై ఎదుట నిరసన తెలుపుతూ ధర్నా చేస్తున్నప్పుడు జరిగిన తోపులాటలో నాలుగు రాళ్ళు విసిరారు. నేను వెంటనే విచారణకు ఆదేశించి టిడిపి కార్యాలయంపై దాడి చేసిన మా వాళ్ళపై కేసులు నమోదు చేయించాను.

Also Read – జగన్‌, కేసీఆర్‌… ఎప్పుడు బయటకు వస్తారో?

మేము ఇంత సంయమనంగా వ్యవహరిస్తే అధికారం చేతిలో ఉంది కదాని సిఎం చంద్రబాబు నాయుడు మా పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను,” అని తమ పార్టీ నేతల దాడిని ధర్నా అని నిసిగ్గుగా సమర్ధించుకున్నారు.

అయితే ఆనాడు మంగళగిరిలో, గన్నవరంలో టిడిపి కార్యాలయాలపై వైసీపి మూకలు దాడులు చేస్తున్నాయని తెలిసిన తర్వాతే టిడిపి నేతలు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేషారు. వారినీ వైసీపి మూకలు చితక బాదాయి.

కానీ వైసీపి మూకలకి బదులు టిడిపి నేతలనే పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. ఈ వీడియో రికార్డింగ్‌లు నేటికీ మీడియా వద్ద భద్రంగానే ఉన్నాయి. సోషల్ మీడియాలో వెతికినా, పోలీస్ స్టేషన్‌, జైలు రికార్డులు వెతికినా అవన్నీ కనబడతాయి.

వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్‌ ఈవిదంగా నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?అన్నట్లు అధినేత ఈవిదంగా వ్యవహరిస్తుంటే, వైసీపి శ్రేణులు బాజా భజంత్రీలతో చిందేయకుండా ఉంటారా?ఇది జగన్‌ సృష్టించిన కాలాకేయ సైన్యం. కనుక హుందాగా ప్రవర్తిస్తారని ఆశించడం అత్యాసే అవుతుంది.