
నిన్న సాయంత్రం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ తాడేపల్లి ఇంటి ముందు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, ఇక ఆ పై టీడీపీ – వైసీపీ పార్టీల మధ్య రాజకీయ చిచ్చు అంటుకోవడం, ఆ మంటలో ఇరు పార్టీల శ్రేణులు రాజకీయ విమర్శల వేడి పుట్టించడం సర్వ సహజంగా జరిగిపోయింది.
Also Read – అమరావతి ‘పట్టాభిషేకం’…వైసీపీ ‘అరణ్యవాసం’..!
‘జగనన్న’ ఇంటి ముందు రెండు సార్లు అగ్ని ప్రమాదం…ఒక మాజీ ముఖ్యమంత్రి కి కూటమి ప్రభుత్వంలో భద్రతా లోపం అంటూ వైసీపీ ప్రచారం ప్రారంభించింది. దీనితో ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఇది టీడీపీ నిర్లక్ష్యానికి, కూటమి ప్రభుత్వ నిర్దయకు సాక్ష్యం అంటూ టీడీపీ మీద బురద జల్లేందుకు సిద్ధమయ్యారు.
అయితే తాజాగా దీని మీద స్పందించిన టీడీపీ సోషల్ మీడియా వైసీపీ కి ఆ పార్టీ అధినేత వైస్ జగన్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది. లిక్కర్ స్కాం పై ఉదయం సిట్ పడగానే రాత్రికి తాడేపల్లి ప్యాలస్ బయట మంటలు చెలరేగాయి. అయితే ఆ మంటలలో వైసీపీ లిక్కర్ పాపాల పొద్దు ఉందా.? లేక జగన్ అక్రమాల చిట్టా ఉందా.? అంటూ తగలబడిన ఆ మంటలలో కాగితాలు, డైరీలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ టీడీపీ వైసీపీ మీద ఎదురు దాడికి దిగింది.
Also Read – ఈయనకి ఎవరైనా కాస్త చెప్పండర్రా!
అలాగే సాయంత్రం ఒకసారి, రాత్రికి ఒకసారి మంటలు అంటుకున్నా, ఆ మంటల మీద అనుమానాలున్నాయంటూ ఆరోపిస్తున్నా ఇంకా అక్కడ ఉన్న సీసీ కెమెరా రికార్డ్స్ ను వైసీపీ ఎందుకు బయటపెట్టలేదు అంటూ నిలదీసింది టీడీపీ. సిట్ విచారణ తనవద్ద వరకు వస్తుందని ముందుగానే గ్రహించి జగన్ ఇలా వాటి తాలూకా ఆధారాలను మంటలలో వేసి తగలబెట్టారా.? తన వేలుతో తనకళ్ళే పొడుచుకుని పక్క వారి మీద నిందలు వేయడం వైసీపీ రాజకీయంలో ఒక భాగమే అంటున్నారు టీడీపీ శ్రేణులు.
ఈ జగన్ తాడేపల్లి ప్యాలస్ ఎదుట రేగిన మంటలు కూడా ఆ జాబితాకు సంబందించినవి గానే భావించాల్సి ఉంటుందన్నారు. అలాగే నిన్న ఉదయం వైసీపీ పార్టీ నేతలతో ముచ్చటించిన వైస్ జగన్ తనను ఇక పై జగన్ 2.0 గా చూడబోతున్నారు అంటూ పార్టీ క్యాడర్ కు సందేశాన్ని పంపించారు. ఈ నేపథ్యంలో జగన్ చూపించే 2.0 ఇదేనా అంటూ టీడీపీ జగన్ కు కౌంటర్ వేసింది.
Also Read – వాళ్ళు పొట్టి శ్రీరాములుని వద్దనుకున్నారు కానీ మనం..
అలాగే జగన్ ఎన్ని 2 .0 లను చూపించి ఇలా ఆధారాలను మంటలలో తగలబెట్టినప్పటికీనూ సిట్ తాడేపల్లి ప్యాలస్ దగ్గరకు రావడం ఖాయం అంటూ గెట్ రెడీ, స్టే ట్యూన్డ్ టూ తాడేపల్లి ఫైల్స్ అని ట్వీట్ చేసిన టీడీపీ, కూటమి ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకు గట్టి బదులిచ్చింది.