సిఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సామాన్య ప్రజలు మొదలు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు.
కొంతమంది డబ్బు రూపంలో అందిస్తుంటే, కొందరు నిత్యావసర సరుకులు, ఆహారం అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పలు ఇన్స్యూరెన్స్ కంపెనీలు విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో పాల్గొని వరదల వలన దెబ్బ తిన్న బైక్‌లు, స్కూటీలు, ఆటోరిక్షాలు, కార్లకు ఇన్స్యూరెన్స్ సొమ్ము చెల్లించేందుకు పత్రాలు స్వీకరిస్తున్నాయి.
Also Read – దువ్వాడ రాజీ ఒప్పందం… జనసేనకు ఓకేనా?
చివరికి రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న బైక్, గ్యాస్ స్టవ్ మెకానిక్కులు కూడా నగర ప్రజలకు ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో మరమత్తులు చేస్తున్నారు.
ఇంతమంది ఇన్ని రకాలుగా విరాళాలు, సేవలు అందిస్తుంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ, సొంత మీడియా మాత్రం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుండటం చాలా బాధ కలిగిస్తోందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Also Read – జగన్, కేసీఆర్… ఎప్పుడు బయటకు వస్తారో?
ఓ ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఈ కష్టకాలంలో ప్రజలకు ధైర్యం చెప్పి యధాశక్తిన సాయం చేయకపోగా వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ బురద రాజకీయాలు చేస్తున్నారని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి నీచ రాజకీయాలు చేసినందుకే ఎన్నికలలో ప్రజలు జగన్‌కి బుద్ధి చెప్పారని, అయినా ఇంకా బుద్ధి రావడం లేదని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
ఎన్నికలలో వైసీపి ఓటమికి కారణం ఎవరు?అని ఆ పార్టీ నేతలు ప్రశ్నించుకుంటే తమ అధినేత జగన్ అని చెప్పుకోక తప్పదు. వైసీపి అంటే జగన్… జగన్ అంటే వైసీపి అన్నట్లు వ్యవహరించేవారు. కనుక వైసీపి గెలుపోటములకు పూర్తి బాధ్యత జగన్‌దే అవుతుంది.
Also Read – విశ్వంభర VFX ఎక్కడ తేడా కొట్టింది?
నీచ రాజకీయాలు చేస్తూ, చేయిస్తూ పార్టీలో అందరి రాజకీయ జీవితాలను జగన్ తారుమారు చేసేశారు. నేటికీ జగన్‌లో ఎటువంటి పశ్చాతాపం లేదు. ఆయన తీరు కూడా మారలేదని స్పష్టం అవుతోంది. కనుక అటువంటి వ్యక్తిని నమ్ముకుంటే చివరికి ఏమవుతుందో గత చరిత్ర చూస్తే వారికే తెలుస్తుంది.