
పక్కనోడికి చెప్పడానికే నీతులు….అదే మన వరకు వస్తే వైసీపీ రాజకీయాలే అన్నట్టుగా సమయాన్ని, సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. లైలా ఫ్రీ రిలీజ్ వేడుకలో పృథ్వి చేసిన కామెంట్స్ గాను బాయ్ కాట్ లైలా అంటూ # టాగ్ ను సర్క్యులేట్ చేస్తున్న వైసీపీ శ్రేణులు గజని లా గతం మరిచారా అనిపిస్తుంది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా బాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ తో వైసీపీ చేసిన రాజకీయానికి ఏ పేరు పెట్టాలి.? అప్పుడు టీడీపీ మీద వైసీపీ శ్రేణులు చేసిన రాజకీయ విమర్శలను ఏమనాలి.? వైసీపీ కి అనుకూలంగా సినిమాలు తీస్తే సినీ ఇండస్ట్రీకి జగన్ మద్దతు ఉంటుందా.? లేకుంటే ఇలా బాయ్ కాట్ అంటూ ఇండస్ట్రీ ని భయపెట్టి బెదిరిస్తారా.?
Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..
అలాగే అధికారం కోసం వైసీపీ చేసిన ఇండస్ట్రీ ‘యాత్ర’లను, అధికారంలోకి రాగానే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ ఏకంగా సామజిక వర్గాలనే రెచ్చకొట్టే మాదిరి జగన్ ఆడించిన తెరవెనుక భాగోతానికి టీడీపీ వారు ఎం చెయ్యాలి.?ఇక పవర్ స్టార్ అంటూ సినీ ఇండస్ట్రీలోని అగ్ర హీరో గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన పవన్ కళ్యాణ్ ను సైతం టార్గెట్ గా వర్మ తీసిన సినిమాలు ఆ వైసీపీ నీలి కళ్ళకు కనిపించవా.?
లేక సినిమాల పేరుతో ఇన్నాళ్ళుగా పప్పు అంటూ లోకేష్ పై, వెన్నుపోటు అంటూ బాబు పై వైసీపీ చేసిన వ్యక్తిగత దాడి వారి చెవులకు వినిపించవా.? అప్పుడేమో ఆ సినిమాలను వైసీపీ తన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రత్యర్థుల మీద రాజకీయ దాడికి దిగింది. కానీ ఇప్పుడు మాత్రం అవేమి తప్పులు కాదు అనేలా సినీ వేదికల మీద రాజకీయాలా.? అంటూ విమర్శలు చేస్తున్నారు.
Also Read – అవినీతిని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటున్నారుగా!
శ్యామల, వెంకటరెడ్డి మరియు ఇతర వైసీపీ మద్దతుదారులు వైసీపీ గత చరిత్రను ఒక్కసారి తెలుసుకుంటే మంచిది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలను భుజాన వేసుకుని ఏకంగా సినిమానే బాయ్ కాట్ చెయ్యాలంటూ వైసీపీ ప్రెస్ మీట్లు పెట్టి మరి పిలుపునివ్వడం ఎంతవరకు న్యాయం.? వైసీపీ బాయ్ కాట్ లైలా అంటే వ్యూహం, శపధం అంటూ వర్మ సినిమాలకు ఏ # టాగ్ ప్రచారం చెయ్యాలి.
దానికి తోడు ఆ సినిమాల ప్రమోషన్స్ కు ఏకంగా ఆనాటి మంత్రులే ముఖ్య అతిధులుగా హాజరయ్యి బాబు, లోకేష్, పవన్ ల మీద చేసిన దిగజారుడు వ్యాఖ్యలకు బాయ్ కాట్ వైసీపీ అనే # టాగ్ రన్ చెయ్యాలా.? లేక వర్మ ను సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని అంటూ డిమాండ్ చెయ్యాలా.? అప్పుడు వైసీపీ నేతలకు ఈ నీతి ప్రవచనాలు గుర్తుకు రాలేదా.?
Also Read – తమిళనాడుకి దూరంగా చంద్రబాబు… దగ్గరవుతున్న పవన్!
కానీ టీడీపీ, జనసేన…వైసీపీ మాదిరి వ్యూహాలకు, శపధాలకు తడబడలేదు, అలాగే ఒకడి కోసం గొఱ్ఱెలమంద మాదిరి అందరి మీదకు తెగబడలేదు. అన్నిటికి కాలమే సమాధానం చెపుతుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది, తెలుసుకుంటారు అంటూ ఓర్పు పట్టారు, ఓపిక వహించారే తప్ప తమ ఉనికి కోసం ఆరాటపడలేదు. ఎవరితోనూ పోరాటానికి దిగలేదు. దాని ఫలితమే నేటి కూటమి విజయం, వైసీపీ పతనం.