YSRCP Rukkus on Chiranjeevi Comments

పార్టీ ఓటమి, సీనియర్ నేతల రాజీనామా, పార్టీ క్యాడర్ నిస్సహాయత, అధినేత ప్యాలస్ రాజకీయాలు, మాజీ మంత్రుల అజ్ఞాత జీవితాలు, అవినీతి మరకలతో వైసీపీ రాజకీయం ఒకరంగా ఐసీయూ లో ఉనికి కోసం పోరాడుతుందనే చెప్పాలి.

ఇటువంటి సమయంలో వైసీపీకి తన వ్యాఖ్యలతో ప్రాణవాయువు అందించి ఊతమిచ్చారు మెగా స్టార్ చిరంజీవి. యాదృచ్చికంగా అన్నారో, యధాలాపంగా చెప్పారో కానీ చిరు చేసిన ‘వారసత్వ’ వ్యాఖ్యల నుంచి మా తాత ‘రసికుడు’ అనే మాటల వరకు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అటు సోషల్ మీడియాలో చిరు పై విమర్శల జడివానే కురుస్తుంది.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

ఇక ఇంత రచ్చ జరుగుతుంటే వైసీపీ ఊరికినే ఉంటుందా.? శవ రాజకీయాలు, వివాద రాజకీయాలలో ఎప్పుడు మొదటి స్థానం లో ఉండే వైసీపీ ఇక చిరు వ్యాఖ్యలను పట్టుకుని తనదైన శైలిలో రాజకీయం మొదలు పెట్టింది. ముందుగా వారసత్వం అంటే అబ్బాయిలేనా.? అందుకు ఆడపిల్లలు పనికి రారా.?

ఆడ పిల్లల మీద అంత పెద్ద మనిషికి ఇంత చిన్న చూపా.? అంటూ మొదలు పెట్టింది. ఇక పవన్ ను టార్గెట్ చేయడానికి చిరు తాత గారి అంశాన్ని తెర మీదకు తెచ్చి దత్త పుత్రుడికి అన్ని తాత పోలికలేనా అంటూ పవన్ మీద మరోసారి వ్యక్తిగత దాడి మొదలుపెట్టింది. జనసేన గెలుపుతో, పవన్ డిప్యూటీ సీఎం పదవితో, వైసీపీ నేతల అక్రమ భాగోతాలతో ఇన్నాళ్ళుగా పవన్ పై ఆగిన వైసీపీ వ్యక్తిగత దాడి ఇప్పుడు చిరు లీక్స్ తో మళ్ళీ మొదటికొచ్చినట్లయ్యింది.

Also Read – తమిళనాడుకి దూరంగా చంద్రబాబు… దగ్గరవుతున్న పవన్!

దీనితో వైసీపీ తమ నోటికి, చేతికి పని చెప్పుతూ పవన్ మీద చిరు మీద రెచ్చిపోతుంది. చిరు తెలిసి చేసారో, తెలియక చెప్పారో కానీ ఈ వ్యాఖ్యలు చిలికి చిలికి అటు మెగా కుటుంబానికి ఇటు జనసేనకి పెద్ద వివాదాన్నే తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి. మరి ఈ వైసీపీ విమర్శల దాడి నుంచి, అటు సోషల్ మీడియా ట్రోలింగ్ నుంచి చిరు ఎలా బయటపడతారో, మెగా కుటుంబాన్ని ఎలా బయటపడేస్తారో.?

అలాగే వైసీపీ దాడి నుంచి పవన్ ను ఎలా తప్పిస్తారో.? అంటూ ఆవేదన చెందుతున్న మెగా అభిమానులకు ఇప్పుడు ‘వల్లభనేని అరెస్టు’ వార్త ఊపిరి పోసినట్లయింది. దీనితో ఒక్కసారిగా మీడియా అటెంక్షన్, సోషల్ మీడియా డెడికేషన్ మొత్తం కూడా చిరు కామెంట్స్ పై నుంచి ఏపీ రాజకీయాల వైపు తిరుగుతాయి. అలాగే ఇటు వైసీపీ కూడా తమ ప్రత్యర్థిని విమర్శలతో టార్గెట్ చెయ్యడానికి బదులుగా తమ పార్టీని, తమ పార్టీ నేతలను డిఫెండ్ చేసుకోవడం మీదనే ద్రుష్టి పెడుతుంది.

Also Read – వైసీపీ ‘గొంతు’నొక్కేస్తే…కూటమి ‘కళ్ళు’ మూసుకుందా.?


చిరు తన అనాలోచిత వ్యాఖ్యలతో తానూ చిక్కులో పడి, రాజకీయ చిక్కులతో అల్లాడుతున్న వైసీపీ నోటికి ఊతమిస్తే, వల్లభనేని అరెస్టు తో టీడీపీ వైసీపీ నోటికి ఊపిరాడకుండా చేసింది. మొత్తానికి అనుకోకుండా జరిగిన అరెస్టుతో ఊహించని ప్రమాదం నుంచి చిరు కాస్త తప్పకున్నారనే అనిపిస్తుంది.