
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై వైసీపీ నేతల స్పందన ఊహించిన్నట్లే ఉంది. ‘కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్ రాజ్యాంగం..’ అంటూ పడికట్టు పదాలతో గలగలా మాట్లాడేస్తున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఒక్కొక్కరూ ఒక్కో కోణంలో విశ్లేషించి వారికి ఘాటుగా సమాధానాలు చెపుతుండటం విశేషం.
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందిస్తూ, నియోజకవర్గంలో ప్రజల నుంచి అందుతున్న పిర్యాదులలో ఎక్కువ శాతం భూకబ్జాలకు సంబంధించినవే. వాటిలో అందరూ వంశీ, ఆయన అనుచరుల పేర్లే చెపుతున్నారు.
Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?
వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్నవరం ప్రజలపై కూడా విరుచుకు పడుతుండేవారు. కానీ జగన్ ఏనాడూ ఆయనని గాడిలో పెట్టలేదు. పెట్టి ఉంటే వంశీ ఇంత రెచ్చిపోయి ఉండేవారా?” అని ప్రశ్నించారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, “వైసీపీలో ప్రతీ నేతకీ ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఒకరు బూతులు మాట్లాడుతుంటారు. మరొకరు తెల్ల రేషన్ కార్డులు బియ్యం దొంగతనం చేస్తుంటారు. వంశీ దౌర్జన్యాలు, భూకబ్జాలు చేసేవారు. ఆయనని అరెస్ట్ చేయకపోతేనే తప్పు కానీ చేస్తే తప్పేలా అవుతుంది?అని ప్రశ్నించారు.
Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ మాట్లాడుతూ, “మాకే కాదు ఏ పార్టీ నేతలు, కార్యకర్తలకైనా వారి పార్టీ కార్యాలయం దేవాలయం వంటిది. కనుక బుద్ధున్నవారెవరూ ఇతర పార్టీల కార్యాలయాలపై దాడులు చేయరు. కానీ వల్లభనేని వంశీ చేశారు.
ఈ దాడి వెనుక ఆయనే ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. కనుక మేము మా రెడ్ బుక్ అమలుచేయాలనుకుంటే మొదటి నెలలోనే వంశీని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళం. కానీ మేము కలుగజేసుకోలేదు. అంతా చట్టప్రకారమే జరగాలని కోరుకున్నాము. పోలీసులు విచారణ జరిపి వంశీని అరెస్ట్ చేశారు.
Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..
పట్ట పగలు అందరూ చూస్తుండగా టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేసినందుకు పోలీసులు ఆయనని అరెస్ట్ చేస్తే వైసీపీ నేతలు సిగ్గు పడాల్సింది పోయి అక్రమ కేసు, అక్రమ అరెస్ట్, రాజకీయ కక్ష సాధింపు చర్య అని మాట్లాడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది,” అని అన్నారు.
మంత్రి అచ్చన్నాయుడు మాట్లాడుతూ, “వంశీ అనుచరులు మా పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు లోపల మా కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు. అతనే పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. కానీ అతను ఆ కేసు ఉపసంహరించుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాను. అంటే వైసీపీ నేతలు అతనిని లేపేస్తామని భయపెట్టి కేసు వాపసు తీసుకున్నాడా?అని అనుమానం కలుగుతోంది. కనుక పోలీసులు ఈ కోణంలో కూడా విచారణ జరిపి అతను ఈ కేసు ఎందుకు వాపసు తీసుకున్నాడో తెలుసుకోవాలి,” అని అన్నారు.