ysrcp-bloodlust-politics

ఆంధ్రప్రదేశ్ స్థాయిని, స్థానాన్ని అంచలంచలుగా పాతాళానికి నెట్టేస్తుంది వైసీపీ రాజకీయం. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఒక లెక్క అనుకుంటే, ఆ అధికార దాహం రుచి మరిగిన వైసీపీ ఇప్పుడు మరింతగా రెచ్చిపోతుంది.

Also Read – సానుభూతి రాజకీయాలకు ప్రభుత్వాలు భయపడుతుంటే..

నాడు అధికారం కోసం ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల ముందు ప్రదక్షణలు చేసిన వైసీపీ నేడు మరో ఛాన్స్ కోసం అదే ప్రజలను బలిపీఠాలు ఎక్కించడానికి సిద్దమయ్యింది. వైసీపీ అధికార దాహం చల్లారాలి అంటే ‘రక్తపాతం’ జరగాల్సిందే అన్నట్టుగా నానాటికి వైసీపీ విధ్వంశకాండ శృతిమించుతోంది.

కూటమి ప్రభుత్వం అణుకువ, అలసత్వం వైసీపీ కి జీవామృతంగా లా పనిచేస్తుంది. ఎవడైతే నాకేంటి.? అన్నట్టుగా సొంత పార్టీ క్యాడర్ నుంచి ప్రభుత్వ అధికారుల వరకు వైసీపీ 2.0 విధ్వంశం కొనసాగుతూనే వస్తుంది.

Also Read – మళ్ళీ యశోదలో కేసీఆర్‌.. వాట్ నెక్స్ట్?

2019 ఎన్నికలకు ముందు జగన్ సొంత చిన్నాన్న వైస్ వివేకానంద రెడ్డి రక్తంతో తడిచిన వైసీపీ రాజకీయం నేడు జగన్ ఫ్లెక్సీ కి రక్తాభిషేకం వరకు విస్తరించింది. అసలు వైసీపీ పార్టీకి ఈ రక్త దాహం ఎందుకు.? తన పార్టీ భవిష్యత్ కోసం, పార్టీ అధినేత పదవి కోసం వైసీపీ ఇంకెంత మందిని బలి తీసుకోవాలని చూస్తుంది.

151 సీట్లతో అధికారంలో ఉన్న పార్టీ 11 సీట్లకు పరిమితయినా ఇంకా వైసీపీ అధికార పార్టీగానే చెలామణి అవ్వాలని చూస్తుంది. సినిమాలలో వాడే డైలాగ్స్ ను ఫలకార్డుల రూపంలో ప్రదర్శిస్తూ రెచ్చిపోతున్న వైసీపీ క్యాడర్ నేడు ఒక అడుగు ముందుకేసి వేట తలలు నరికి జగన్ ఫ్లెక్సీ కి రక్తాభిషేకం చేస్తున్నారు.

Also Read – బైజూస్ కాదు.. మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్.. ఇదే అవసరం!

వేటకొడవళ్లు చేత పట్టుకుని నడి రోడ్ల మీద చిందులేస్తూ వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు జగన్ కటౌట్ కు రక్తాభిషేకం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో అసలు ఏపీలో ఎం జరుగుతుంది అన్న చర్చ జరుగుతుంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో రక్తాభిషేకాలు చేయడం, నరుకుతాం, చంపుతాం, తొక్కుతాం అంటూ బెదిరింపు పోస్టర్లు ప్రదర్శించడం తో వైసీపీ ఏపీని ఏ దిశగా తీసుకెళ్లాలని భావిస్తుంది అన్న ప్రశ్న తలెత్తుతుంది.

నాడు నరుకుతాం అంటే తప్పేముంది అంటూ పార్టీ శ్రేణుల బరితెగింపును వెనకేసుకొచ్చిన జగన్ నేడు తన ఫోటోలకు రక్తాభిషేకాలు చేసిన క్యాడర్ కి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తారా.? దండాలు పెట్టి పార్టీ పదవులిస్తారా.?

నాడు ఏపీ రాజకీయాలకు బూతులు పరిచయం చేసిన వైసీపీ నేడు అదే ఏపీ రాజకీయాలకు రక్తాభిషేకాలను పరిచయం చేస్తుంది. వేట తలలతో మొదలైన ఈ రక్తాభిషేకాలు చివరికి ఎవరి తలలను బలి కోరనుందో.? కాలమే నిర్ణయించాలి.




కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ విధ్వంసాన్ని కేసుల రూపంలో కాకుండా శిక్షల రూపంలో నియంత్రించాలి. లేకుంటే ఏపీ భవిష్యత్ వైసీపీ రాజకీయ రక్తంతో తడిచి ముద్దవ్వక తప్పదు.