
ప్రకాశం జిల్లా జగన్ పొదిలి పర్యటన మరొక విధ్వంసానికి సాక్షిగా నిలిచింది. పొగాకు రైతులతో మాట్లాడడానికి పొదిలి పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ వైసీపీ 2.0 కి జస్ట్ శాంపిల్ ఆ అన్నట్టుగా వైసీపీ అభిమానులు హద్దులు దాటారు.
అమరావతి పై సాక్షిలో రాచుకున్న రచ్చ, అందుకు వైసీపీ పోసిన పెట్రోల్ కలిసి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై వ్యతిరేకతను ఇంకాస్త పెంచింది, సాక్షి యాజమాన్యం పై అసహనాన్ని సృష్టించింది.
Also Read – జగన్ ఆలోచింపజేయగలుగుతున్నారు మరి కూటమి నేతలు?
దీనితో జగన్ కు తమ ఆవేదన వ్యక్తపరచడానికి, సాక్షికి తమ నిరశన తెలపడానికి రథం రోడ్డులోని పీఎస్ఆర్ కాలిని సమీపంలో నల్లబెలూన్లు, ఫకార్డులు పట్టుకుని మహిళలు శాంతి యుత ఆందోళన చేపట్టారు. జగన్ క్షమాపణలు చెప్పాలంటూ, భారతి మౌనం వీడాలంటూ డిమాండ్ చేసారు.
అమరావతి మహిళలలో వైసీపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు గాను వైసీపీ అధినేత జగన్ మహిళలకు క్షమాపణలు చెప్పి పొదిలి వెళ్లాలని డిమాండ్ చేయడంతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు అక్కడ ఉన్న మహిళల పై రాళ్ల దాడి చేసారు.
Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!
దీనితో కొందరు ఆందోళన కారులు, పలువురు పోలీస్ సిబ్బంది కూడా గాయపడ్డారు. అయితే కేవలం 11 సీట్లతో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా దక్కించుకొని వైసీపీ 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని లెక్క చేయకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఒక రాష్ట్ర రాజధాని ప్రాంతం పై, అక్కడి మహిళల పై సాక్షి, వైసీపీ చేస్తున్న నీచమైన విమర్శలకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇంకాస్త కఠినంగా ఉండాల్సిందే అనే వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది.