
నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ప్రజలు, ప్రముఖులు తమ తండ్రులను గుర్తు చేసుకొని వారితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన జగన్ కూడా తండ్రి ఫోటోతో “ఎప్పటికీ నువ్వే నాకు స్పూర్తి, నా ఆశయం, నా రోల్ మోడల్. ప్రతీ అడుగులో నువ్వే నా స్పూర్తి. హ్యాపీ ఫాదర్స్ డే” అంటూ ఓ ట్వీటేశారు.
Also Read – రాజకీయాలలో మెట్టు దిగడం.. ఇలా కాదు!
తండ్రి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోతే ఆయన అంత్యక్రియలు జరుగక ముందే ముఖ్యమంత్రి పదవి కోసం ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన జగన్ నుంచి ఇంతవరకు ఎవరూ స్పూర్తి పొందకపోవడం చాలా బాధాకరం.
తండ్రి చనిపోతే అందరూ జగన్‌ని ఓదార్చాలి. కానీ గుండెపోట్లు తెచ్చుకొని లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయనే జనాలను ఓదార్చడానికి బయలుదేరడం, ఆ పేరుతో వైసీపీకి బలమైన పునాదులు వేసుకోవడం, రాజకీయాలలో ప్రవేశించి రాణించాలనుకునే వారికి చాలా స్పూర్తినిస్తుంది.
Also Read – అసెంబ్లీ వద్దు మీడియానే ముద్దా.?
తండ్రి స్పూర్తితో తాను రాజకీయాలు చేస్తున్నానని జగన్ అనుకోవచ్చు గాక. కానీ బాబాయ్ వివేకాకి బైబై చెప్పేసి ఏపీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, తల్లిని చెల్లిని మెడ పట్టుకొని గెంటేసి, ఆస్తుల కోసం కోర్టుకీడ్చి, వీరవిధేయ విజయసాయి రెడ్డిని పారిపోయేలా చేసిన జగన్, ‘నాకు మా నాన్నారే స్పూర్తి’ అంటే ‘వైఎస్ కూడా అలాంటి పనులే చేశారా?’ అని జనాలకి జగన్ అనుమానం కలిగిస్తున్నారు కదా?
ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వం జగన్మయం చేసి, అధికారం కోల్పోగానే మళ్ళీ తండ్రి ఫోటోని వైసీపీ సోషల్ మీడియాలో పెట్టుకొని ‘నువ్వే నాకు స్పూర్తి’ అని జగన్ చెప్పుకోవడం కంటే నిజంగానే ఆయన స్పూర్తితో రాజకీయాలు చేసుకుంటే నేడు ఇటువంటి దుస్థితిలో ఉండేవారు కాదు కదా?