YS Jagan

రాజకీయ నాయకులు కూడా మనుషులే కనుక వారిలో రకరకాల మనస్తత్వాలున్నవారు కనబడుతుంటారు. ‘అన్నీ నాకు మాత్రమే తెలుసు… నేను దైవాంశ సంభూతుడిని అనుకునే’ కేసీఆర్‌, ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా బేలతనం ప్రదర్శించకుండా ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేస్తూ సాగిపోయే రేవంత్‌ రెడ్డి వంటివారున్నారు.

మాటకారితనంతో ఏదైనా మాట్లాడవచ్చనుకునే కేటీఆర్‌, దూకుడుతనంతోనే గుర్తింపు తెచ్చుకున్న బండి సంజయ్‌ కళ్ళ ముందే ఉన్నారు.

Also Read – జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ Vs మెగా ఫాన్స్ – ఎవరికి ఉపయోగం??

మంత్రులుగా ఏం చేశారో ఎవరికీ తెలియకపోయినా డ్యాన్సులు చేసి పాపులర్ అయినవారిలో మన అంబటి రాంబాబు, రోజా, అక్కడ తెలంగాణలో మల్లారెడ్డివంటివారున్నారు.

సమస్యలు, సవాళ్ళలోనే అవకాశాలు వెతుకొంటూ చాలా సంయమనంగా మాట్లాడుతూ రాజకీయాలు చేయడం సిఎం చంద్రబాబు నాయుడు శైలి. ఆయన బాటలోనే పయనిస్తూనే ‘మాటకు మాట, దెబ్బకు దెబ్బ’ అనే నారా లోకేష్‌ వంటి రాజకీయ నాయకుడు మన కళ్ళ ముందే ఉన్నారు.

Also Read – మరో వివాదంలో మంత్రిగారు..!

అయితే వీరందరీలో ఏదో ఒక్క లక్షణం కొట్టవచ్చిన్నట్లు కనబడుతుంది. కానీ జగన్‌లో పరస్పర భిన్నమైన లక్షణాలతో ఓ ‘అపరిచుతుడు’గా కనిపిస్తుంటారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణభయంతో పచ్చటి చెట్లు నరికించేసిన జగన్, ఇప్పుడు నిర్భయంగా ప్రజలకు మద్యకు వస్తుండటం ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.

Also Read – జగన్‌ ఇంకా కాంగ్రెస్‌వైపు చూస్తూనే ఉన్నారా?

నాడు బయటకు వస్తే దారిపొడవునా పరదాలు కట్టించుకునేవారు కానీ నేడు పరదాలు లేకుండానే తిరుగుతున్నారు.

నాడు పంటలు నీట మునిగితే గట్టున టెంట్ వేయించుకొని, కాలికి మట్టి అంటకుండా కింద కార్పెట్ పరిపించుకొని పరిశీలించిన జగనే నేడు మోకాలిలోతు బురద నీటిలో నిలబడి ఫోటోలకు ఫోజులు ఇస్తుండటం గమనిస్తే ఆయనలో ‘అపరిచితుడు’ కనిపిస్తాడు.

వరద బాధితుల కోసం మొసలి కన్నీళ్ళు కార్చాలని వచ్చి ఆ సంగతి మరిచిపోయిన్నట్లు, సిఎం చంద్రబాబు నాయుడుని, ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రజల కోసమే నా ఈ జీవితమన్నట్లు మాట్లాడి, బెంగళూరు ప్యాలస్‌లో సేద తీరుతుండటం వంటి భిన్నమైన ప్రవర్తనలు జగన్‌లో అపరిచితుడుని పరిచయం చేస్తుంటాయి.

అపరిచితుడులో ‘మంచివాడు’ నా అక్కలు, చెల్లెమ్మలు, అవ్వాతాతలు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు అంటూ కూనిరాగం తీస్తుంటే, ‘చెడ్డవాడు’ సొంత తల్లిని బయటకు పొమ్మంటాడు. చెల్లిని తిట్టిపోస్తుంటాడు. బాబాయ్ సంగతి తెలిసిందే.

అపరిచితుడి పాలనలో ‘గరుడపురాణం’ ప్రకారం తనకు నచ్చని చంద్రబాబు నాయుడు, అచ్చంనాయుడు వంటి వాళ్లందరినీ శిక్షించే ప్రయత్నం చేశాడు కూడా. కానీ ఆ గరుడపురాణం ప్రకారమే ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం వైసీపి నేతలపై కేసులు నమోదు చేస్తే అన్యాయం, అక్రమం అంటూ ఆక్రోశిస్తున్నారు. ఎందుకంటే అపరిచితుడు ఓ పాత్రలో నుంచి మరో పాత్రలోకి మారినప్పుడు పాత విషయాలు మరిచిపోతాడు కనుక.

ఇంత విలక్షణమైన రాజకీయ నాయకుడు దేశంలో చాలా అరుదుగా జన్మిస్తుంటారు. కనుక వారిని కాపాడుకునే బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రజలది, ప్రభుత్వానిదే.