ysrcp-flexies-pushpa-2-theatres

సినిమాలకు రాజకీయాలకు ఎప్పుడో లంకె పడింది. కనుక ఒకదాని ప్రభావం మరోదానిపై ఎంతో కొంత తప్పక ఉంటుంది. నిజానికి అలా ప్రభావం చూపాలనే వ్యూహం వంటి సినిమాలు తీస్తున్నారు కూడా. సినిమాలలో హీరోలు నిజ జీవితంలో ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు, సవాళ్ళకి ఏదో సన్నివేశంలో పంచ్ డైలాగులతో సెటైర్స్ వేసి జవాబు ఇస్తుండటం కూడా పరిపాటే.

మాజీ మంత్రి అంబటి రాంబాబుకి పృధ్వీ చేత వేయించిన పంచ్ ఇందుకు ఓ చిన్న ఉదాహరణ అనుకుంటే పుష్ప-2లో కూడా అటువంటి పంచులు చాలా పడ్డాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని నిజమే కానీ మిగిలినవి రాజకీయ దురుదేశంతో ఎవరూ సృష్టించి వైరల్ చేస్తున్నవే.

Also Read – M9 పాఠకులకు ‘భోగి’ పండుగ శుభాకాంక్షలు..!

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌, రామ్ చరణ్‌లను ఉద్దేశించి అల్లు అర్జున్‌ పుష్ప-2లో డైలాగ్స్ చెప్పారంటూ పుకార్లు పుట్టించాల్సిన అవసరం ఎవరికి ఉందో ఆలోచిస్తే వైసీపీయే అని అనుమానించాల్సి ఉంటుంది.

పవన్ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం వైసీపీకి కడుపు మంటగా ఉండొచ్చు. కానీ అందుకోసం ఇటువంటి పుకార్లు వ్యాపింపజేయడం సబబేనా?అని ఆలోచిస్తే బాగుంటుంది.

Also Read – బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ‘అన్-స్టాపబుల్’..!

అలాగే పుష్ప-2 సినిమా థియేటర్ల ముందు అభిమానులు, ప్రేక్షకుల త్రొక్కిసలాటలు సాగుతుంటే, అన్ని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిపోతే, కొన్ని థియేటర్లలో టికెట్స్ అమ్ముడవక సినిమా వేయలేదని సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తుండటం గమనిస్తే, సినీ-రాజకీయాలు ఎంత నీచ స్థాయికి దిగజారిపోయాయో అర్దం అవుతుంది.

ఇదివరకు ఎన్టీఆర్, జూనియర్ ఫోటోలతో వైసీపీ పోస్టర్స్ వేయించి ఎన్టీఆర్-చంద్రబాబు కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించింది. ఆ తర్వాత టీడీపీ, జనసేన పొత్తులు చెడగొట్టాలని పవన్ కళ్యాణ్‌ని రెచ్చగొట్టింది.

Also Read – కౌశిక్ రెడ్డి…పార్టీ కోసమా..? పేరు కోసమా.?

పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్ మద్య చిచ్చు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. ఇవికాక వైసీపీ దుష్ట ఆలోచనలకు వ్యూహం వంటి సినిమాలు నిదర్శనంగా ఉండనే ఉన్నాయి. కనుక ఈ పుకార్ల వెనుకు వైసీపీ ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఓ పక్క పుష్ప-2ని దెబ్బ తీయడానికి ఇటువంటి నీచమైన కుట్రలు చేస్తూనే మరో పక్క పుష్ప-2 ప్రదర్శించబడుతున్న థియేటర్ల వద్ద జగన్‌, స్థానిక వైసీపీ నేతల ఫోటోలతో వైసీపీ బ్యానర్లు పెట్టించడం చవుకబారు రాజకీయాలు చేయడమే.




వైసీపీకి నిజంగా అల్లు అర్జున్‌, పుష్ప-2 సినిమా మీద అంత అభిమానమే ఉంటే, పుష్ప-2కి దూరంగా ఉంటే అదే పదివేలు. ఓ పక్క మద్దతు ప్రకటిస్తూనే మరోపక్క పుకార్లు పుట్టిస్తూ సినిమాని దెబ్బ తీయాలనుకోవడం సిగ్గుచేటు. అయినా సినిమాలని కూడా తమ నీచ రాజకీయాలకు ఉపయోగించుకోవాలని అనుకోవడం, ఉపయోగించుకుంటూ వాటినే దెబ్బ తీయడం నీచ రాజకీయాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు.