ysrcp-leaders

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలు ఆ పార్టీలో ప్రతీ ఒక్కరికీ ఒక్కో గొప్ప చరిత్రలు ఉన్నాయి. జగన్‌ స్వయంగా ఆక్రమాస్థుల కేసులలో జైలుకి వెళ్ళి వచ్చారు. ఆయనతో పాటు ప్రస్తుతం పెద్దల సభలో కూర్చొంటున్న పెద్ద మనిషి విజయసాయి రెడ్డి కూడా 16 నెలలు చంచల్ గూడా జైల్లో ఉండి వచ్చినవారే.

అయినప్పటికీ ఎంపీ కనుక ఏదో వంకతో హోంమంత్రి అమిత్ షా, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ తదితర కేంద్ర మంత్రులను కలుస్తూ వారితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. తద్వారా తనకు రాజకీయంగా చాలా పరపతి ఉందని, కనుక ఎవరూ తన జోలికి రావద్దని చెపుతున్నట్లే ఉంది. కానీ ఆయన చర్యలు ఆక్రమాస్తుల కేసు విచారణని ప్రభావితం చేస్తున్నట్లుగా సీబీఐ, ఈడీలు భావించకపోవడం విశేషం.

Also Read – ఈ టాలీవుడ్‌కి ఏమైయిందో?

రాష్ట్ర స్థాయిలో చూస్తే హోంమంత్రిగా చేసిన విడుదల రజని స్టోన్ క్రషర్ కంపెనీ యాజమనులను బెదిరించి రెండుకోట్లు వసూలు చేయగా, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాముల నుంచి రేషన్ బియ్యం మాయం అయిపోతుంటుంది.

క్రైమ్ స్టోరీలలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంత బాబుల పేరు వినిపిస్తూనే ఉంటుంది. అటువంటిదే మరో క్రైమ్ స్టోరీలో వైసీపీ సీనియర్ నేత గౌతం రెడ్డి పేరు వినిపిస్తోంది ఇప్పుడు. ఓ భూవివాదంలో విజయవాడకు చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రిని కిరాయి హంతకులతో హత్య చేయించుకు ప్రయత్నించిన్నట్లు గౌతం రెడ్డిపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.

Also Read – ఏపీలో పర్యాటకం… ఇదిగో శాంపిల్!

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి, చెవిరెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి తదితరుల భూకబ్జాల స్టోరీల గురించి ఎంత చెప్పుకున్నా తరగవని టీడీపీ నేతలు వాదిస్తుంటారు.

ఇవన్నీ వింటున్నప్పుడు వైసీపీలో కొందరు స్టేట్ లెవెల్ కాగాకొందరు నేషనల్, కొందరు ఇంటర్నేషనల్ అని అర్దమవుతుంది. కనుక ఓకే రకం మైండ్ సెట్ ఉన్న ఘనులు అందరూ వైసీపీ గొడుగు కిందకు చేరిన్నట్లన్ననిపిస్తుంది.

Also Read – వివేకానంద గురించి జగన్‌ ట్వీట్


అయినప్పటికీ జగన్‌ తాను చాలా నీతి నిజాయితీగా పాలన చేశానని, రాష్ట్రానికి, ప్రజలకు తానే ఎంతో మేలు చేశానని నిర్లజ్జగా చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా?