ysrcp-ys-jagan

అంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీ పార్టీ ఆవిర్భావానికి ముందు ఆ తరువాత అన్నంతంగా మారిపోయాయి. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజకీయం మొదలుపెట్టిన జగన్ రాజకీయాలకు కొత్త సంస్కృతులను పరిచయం చేసారు.

జగన్ తన రాజకీయ అరంగేట్రంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా నిలిచారు. తన తండ్రి వైస్సార్ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేసిన రాజకీయ నేతగా దేశాన్నే తన వైపు తిప్పుకున్నారు. ఇక అక్కడితో మొదలైన జగన్ రాజకీయ అరాచకాలు అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు ఆయనతో పాటుగా ఆ పార్టీ నాయకులు కూడా అందరిని తమ వైపు ఆకర్షించుకుంటున్నారు.

Also Read – మా పాలిట ‘వరం’ సామి..!

తండ్రి వైస్సార్ సమాధి మీద పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ, బాబాయి వివేకా రక్తంతో తడిచి, తల్లి కన్నీళ్లు చెల్లెలు కష్టంతో నిలబడి, లక్షల కోట్ల అవినీతి సొమ్ముతో రాజకీయాలను శాసిస్తుంది. జగన్ పదవి కాంక్ష రాష్ట్రానికి కొన్ని నూతన వరవడులను తీసుకు వచ్చింది.

* ఆడవారితో రాజకీయం:

Also Read – ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో బానే తెలుసుకున్నారుగా

జగన్ రాజకీయాలలోకి వచ్చాక ఏపీలో మొట్టమొదటిగా నాటిన విష విత్తనం రాజకీయాలలోకి మహిళల ప్రస్తావన. రాజకీయాలతో సంబంధం లేని మహిళలను వారి వ్యక్తిగత జీవితాన్ని, వారి వ్యక్తిత్వాన్ని రాజకీయ వేదికల మీదకు తీసుకు వచ్చిన మొట్టమొదటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.

మహిళలతో జగన్ చేసే రాజకీయానికి వావి వరుస, చిన్న పెద్ద, వయస్సు, తన పర బేధాలు ఉండవు. ఆమె చంద్రబాబు భార్య అయిన, పవన్ అర్ధాంగి అయిన, వైస్సార్ సతీమణి అయిన, తన తోడబుట్టిన సోదరి షర్మిల, సునీతాలైన జగన్ దృష్టిలో అందరు ఒక్కటే.తన పదవి కాంక్షకు అడ్డుపడుతున్నారు అంటే అది తల్లినా చెల్లైనా డోంట్ కేర్ అంటూ తన సాక్షిలో ఆత్మ సాక్షిలేని విమర్శలు గుప్పిస్తారు.

Also Read – షిప్ సీజ్ అయ్యింది…ఇక అసలు కథ మొదలయ్యింది…!

* బూతుల సంస్కృతీ:

ఏపీ రాజకీయాలలో ఈ విష విత్తనం నాటింది కూడా జగనే. తన రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక వారిని బూతులతో తిట్టిస్తూ, నీచంగా కించపరుస్తూ వ్యక్తిత్వ హననానికి ప్రోత్సహించడం జగన్ దినచర్యలో ఒక భాగమయ్యింది. బూతులు తిట్టు పదవి పట్టు అన్నట్టుగా జగన్ కొడాలి, వల్లభనేని, రోజా, పేర్ని నాని, జోగి రమేష్, దువ్వాడ వంటి నేతలతో రాజకీయాలలోకి ఈ విష సంస్కృతిని భాగం చేసారు.

* దాడులను ప్రోత్సహించడం:

వైసీపీ ఐదేళ్ల అధికారాన్ని పూర్తిగా కక్ష్య సాధింపు చర్యల కోసమే వినియోగించారు అంటే అతిశయోక్తి కాదు. జగన్ తానూ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకుల మీద, వారి ఇళ్ల మీద, వారి పార్టీ కార్యాలయాల మీద జరిగిన దాడులు, వారి మీద పెట్టిన కేసులు, అరెస్టులు, జైళ్లు, బైళ్ళు ఏపీ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ చూడలేదు. దాడులు చేస్తే మా ఆపార్టీ క్యాడర్ కు బీపీలు వచ్చాయి, అయితే ఏంటి? అంటూ వెనకేసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగనే.

* అస్లీలత:

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వంలోని మంత్రులుగా పని చేసిన వారు, ఆ ఆపార్టీలో ఎంపీలుగా గెలిచిన వారు ప్రజలకు రాజకీయంలో అస్లీలతకు అడ్డం పట్టారు. గంటా అరగంట అంటూ అంబటి, అవంతి, సోషల్ మీడియాలో నిజ రూప దర్శనంతో మరో ఎంపీ మాధవ్, పిలిస్తే రావాలి కదా అంటూ గొర్ల కిరణ్ కుమార్ వంటి వైసీపీ నేతల అస్లీలతకు సోషల్ మీడియా సాక్షిగా మిగిలింది.

ఇప్పుడు మరో వైసీపీ ముఖ్య నేత జగన్ కు అత్యంత సన్నిహితుడు విజయ సాయి రెడ్డి మీద కూడా ఇటువంటి అస్లీల ఆరోపణలే వినిపిస్తున్నాయి. దీనితో విజయ ‘సాయి’ రెడ్డి పేరును విజయ ‘శాంతి’ రెడ్డిగా మారుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వైసీపీ వ్యతిరేక వర్గం. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతల పై చర్యలు తీసుకోకుండా వీరు చాల సౌమ్యులు, మంచి వారు అంటూ జగన్ సర్టిఫై చేస్తూ వారిని రాజకీయాయంగా ప్రోత్సహిస్తున్నారు.

* కూల్చివేతలు:

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత చేసిన మొట్ట మొదటి పని రాష్ట్రానికి కూల్చివేతలను పరిచయం చెయ్యడమే. ప్రజావేదికతో మొదలుపెట్టిన జగన్ కూల్చివేతల పర్వం రాజధాని అమరావతి తో కొనసాగిస్తూ పెట్టుబడులను తరిమేసి పారిశ్రామిక రంగాన్ని, సంక్షేమం పేరిట ఆరిక వ్యవస్థలను, పెంచిన పన్నులతో ప్రజల జీవన ప్రమాణాలను కూల్చివేశారు.

* హత్య రాజకీయాలు, గ్రాఫిక్స్ మాయలు:

హత్య ఆరోపణలు ఎదుర్కుంటున్న సొంత పార్టీ నేతలను చిన్న పిల్లాడు, అమాయకుడు అంటూ అవినాష్ రెడ్డిని వెనకేసుకురావడం, హత్య చేసి నిరూపించబడిన అనంతబాబు కు ఆశ్రయం కల్పించడం ఒక్క జగన్ కే చెల్లింది. అలాగే బహిరంగ సభలకు సైతం గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ వాడడం, ఋషి కొండకు గుండు కొట్టి గ్రాఫిక్స్ తో కవర్ చెయ్యడం, ఐ ప్యాక్ అంటూ ఒక సోషల్ మీడియా విభాగాన్ని సృష్టించి ఎక్కడిక్కడ కనికట్టు మాయలు చేయడం జగన్ మొదలుపెట్టిన విష సంస్కృతీలో ఇది ఒకటి.

* వైసీపీ కాలకేయ సైన్యాన్ని తయారు చేయడం:

తమ రాజకీయ ప్రత్యర్థులను, వారి మద్దతుదారులను మనసికంగా దెబ్బకొట్టడానికి సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలమగా ప్రతిపక్ష పార్టీ నేతలను చెప్పలేని, వినలేని భాషతో దూషించడానికి, రాజకీయాలలో విలువలను ఏ స్థాయికి దిగజార్చవచ్చో చూపించడానికి శ్రీ రెడ్డి, బోరుగడ్డ, పంచ్ ప్రభాకర్, పోసాని, రాంగోపాల్ వర్మ, సజ్జల భార్గవ్ రెడ్డి, వర్ర రవీంద్ర రెడ్డి వంటి వారిని సోషల్ మీడియా సైకోలుగా సృష్టించి సమాజం మీదకు వదిలారు జగన్.




ఇలా చెప్పుకుంటూ పొతే జగన్ రాజకీయాల్లో నాటిన విష విత్తనాల ఫలాలు చేతికి అందే స్థాయి వరకు పెంచి పోషిస్తే ఇక సమాజంలో మహిళలకే కాదు ఎవరికీ సామజిక భద్రత అనేది అందని ద్రాక్షే అవుతుంది. రాజకీయాలలోకి ఇటువంటి నీచ సంస్కృతులను పరిచయం చేసిన వైసీపీ రాజకీయాలను కలుషితం చేసేసింది. అందుకే వైసీపీ ఈజ్ ఇంజ్యురియస్ టూ పాలిటిక్స్ అనక తప్పదు.