vidadala-rajini Warnings

వైసీపీ నేతల వ్యాపార ధోరణి ఏ విధంగా ఉంటుందో ఆ పార్టీ నేతల విమర్శలలో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వడ్డీలు, చక్రవడ్డీలు అంటూ 164 సీట్లతో ప్రభుత్వాన్ని చేపట్టిన కూటమి నేతలను 11 సీట్లతో ప్రతిపక్షానికి కూడా దూరమైన వైసీపీ భయపెట్టాలని చూస్తుంది.

యధా రాజా తధా ప్రజా అన్నట్టుగా నాయకుడు బెదిరింపులను ప్రోత్సహిస్తే నేతలు ప్రవచనాలు చెపుతారా.? అన్నట్టుగా ఎవరికీ వారు తమ నియోజకవర్గంలోని కూటమి నేతలను ఉద్దేశిస్తూ ఈ ఐదేళ్ల మీ అధికార బెదిరింపులకు మా ప్రభుత్వంలో వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ ప్రభుత్వంలో ఉన్నవారిని ప్రతిపక్షంలో ఉన్నవారు హెచ్చరిస్తున్నారు.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

వైసీపీ మహిళ నేత, మాజీ మంత్రి విడుదల రజని టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు ని ఉద్దేశిస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేసారు. నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు మీ పాతికేళ్ల రాజకీయం తలవంచింది. అక్రమ కేసులతో నన్ను, నా కుటుంబాన్ని భయపెట్టాలని చూస్తే తిరిగి మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఇవన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం.

రాజకీయ నాయకులనే కాదు వారికి తొత్తులుగా పని చేస్తున్న అధికారులను సైతం విడిచి పెట్టేదేలే. నాకు ఇంకా 30 ఏళ్ళ రాజకీయ భవిష్యత్ ఉంది. పుల్లారావు ఎక్కడ దాక్కున్నా లాకొచ్చి మరి లెక్కలు తెలుస్తా అంటూ విడుదల రజని తన తొమ్మిది నెలల ప్రతిపక్ష ఫ్రస్టేషన్ మొత్తం మీడియా ముందు కక్కారు. అయితే తొమ్మిది నెలలకే ఇంతగా కలత చెందిన రజని, ఏడేళ్ల రాజకీయ అనుభవంతోనే ఈ రకమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?

మరి గత ఐదేళ్ల వైసీపీ పాపాలకు, రజని దోపిడీకి, వైసీపీ నేతల దౌర్జన్యాలకు కూటమికి వడ్డీ ఎవరు చెల్లిస్తారు.? వడ్డీలు తీసుకోవడమే కానీ చెల్లించే అలవాటు వైసీపీ డిఎన్ఏ లో లేదా.? ఏడేళ్ల అనుభవం పాతికేళ్ల అనుభవాన్ని భయపెట్టాలని చూస్తుంది. గతంలో జగన్ తన పదేళ్ల అనుభవంతో నాలుగు దశాబ్దాల అనుభవాన్ని బందించి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు.

అయినా కూడా వైసీపీ నేతలకు ఇంకా వాస్తవాలు అవగతం అవ్వకపోవడం వారి అహంకారానికి నిదర్శనం. రాజకీయాలంటే వడ్డీ వ్యాపారమో, లిక్కర్ మాఫియానో, భూ దందాలో కాదు రాజకీయం అంటే రాజీ లేని పోరాటం, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజాప్రయోజనాల కోసం నిరంతర రాజకీయ యుద్ధం చేయాలి.

Also Read – తమిళనాడుకి దూరంగా చంద్రబాబు… దగ్గరవుతున్న పవన్!

ప్రతిపక్షంలోకి రాగానే అసెంబ్లీ కి రాను, అధికారంలో ఉంటే ప్రతిపక్షాన్ని బతకనివ్వను అంటూ రెచ్చిపోతే చివరికి ఇలా రౌడీల మాదిరి బెదిరిస్తూ భయపెడుతూ బతకాల్సిందే.