2024 ఎన్నికల ప్రచార సందర్భములో భాగంగా కూటమి నేతలను ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన శపధాలు ఇప్పుడు వారి పాలిట శాపాలుగా మారాయా అన్నట్టుగా పరిస్థితులు తారుమారయ్యాయి.
Also Read – రేషన్ బియ్యం పట్టుబడితే ఎదురు దాడి.. భలే ఉందే!
ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజా, సత్తుపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రోజాకు, అంబటికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.
అధికారంలోకి కాదుకదా పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటూ అప్పుడు అధికార అహంకారంతో రెచ్చిపోయిన రోజా ఇపుడు మాజీ ఎమ్మెల్యేగా మిగిలి అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయారు. దీనితో రోజాను చూసి అసెంబ్లీ గేటు తాకలేనిదెవరో అర్దమయ్యిందా అంటూ మాజీ మంత్రికి పుండు మీద కారం చల్లుతున్నారు జనసేన నేతలు.
Also Read – నారదుడుకి తక్కువేమీ కాదు.. మన వర్మ
అలాగే గత ప్రభుత్వ హయాంలో బాబు పైన బాబు కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన కొడాలి నాని ఇప్పుడు అసెంబ్లీ గేటు కాదు కదా కనీసం తన ఇంటి గేటు కూడా దాటలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు బూట్లు తుడుస్తాకి సిద్ధం అంటూ శపధాలు చేసిన ఈ బూతుల నేత ఇపుడు ఏ గూటిలో దాక్కున్నాడో కూడా తెలియదు.
అలాగే జగన్ అండ చూసుకుని టీడీపీ జెండాతో గెలిచి టీడీపీ పార్టీకే వెన్నుపోటు పొడిచిన వల్లభనేని వంశీ ప్రజలిచ్చిన తీర్పుతో అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఇక పర్సెంటా..అర పర్సెంటా అంటూ కూటమి మీద తొడలుకొట్టి ఓడిపోతే రాజకీయ సన్యాసమే అంటూ గొంతు చించుకున్న అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు గొంతెత్తలేని పరిస్థితి.
Also Read – బాణమనుకుంటే బల్లెంలా మారిందేమిటి?
ఇక వై నాట్ 175 రాష్ట్రంలో ప్రతిపక్షమే లేని ప్రభుత్వం అంటూ వైసీపీ శ్రేణులను ఊహాలోకంలో విహరింపచేసిన వైస్ జగన్ ఇప్పుడు 11 సీట్లతో ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం భేరాలు మొదలుపెడుతున్నారు. గత వైసీపీ విజయం దేవుని స్క్రిప్టే అంటూ విర్రవీగిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలిచ్చిన తీర్పుని అంగీకరించలేక మిషన్ల మీద నెపం నెట్టి తప్పులు కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు పవిత్రమైన అసెంబ్లీని బూతుల పాఠశాలగా మార్చి, శాసనసభ గౌరవ మర్యాదలను నేలరాల్చి, గౌరవ సభను కౌరవ సభగా చేసిన నేతలందరికీ ఇప్పుడు అసెంబ్లీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితి దాపరించింది. వైసీపీ నేతలు చేసిన ఈ పాపాలకు ఏపీ ప్రజానీకం ఇచ్చిన తీర్పు చారిత్రకమైనది.
అలాగే అప్పుడు గెలుపు ధీమాతో ప్రత్యర్థి పార్టీ నేతలను ఉద్దేశించి వైసీపీ నాయకులు చేసిన శపధాలు ఇప్పుడు వారికే శాపాలుగా మారి వారి రాజకీయ జీవితానికే ఒక ప్రశ్నార్థకంగా తయారయ్యాయి.