
అనగనగా ఒక వైసీపీ కుటుంబం, ఆ కుటుంబంలో ఎమ్మెల్యే ల నుంచి ఎంపీ ల వరకు దాదాపు అందరు అందగాళ్లే. అయితే ఈ వైసీపీ కుటుంబంలో నాయకులందరు అందగాళ్లే అన్న విషయం స్వయానా ఆ పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డే పరోక్షంగా ధ్రువీకరించారు.
అసలు విషయానికొస్తే, గన్నవరం వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తన గత ఐదేళ్ల పాపానికి గాను నేడు న్యాయస్థానం ముందు దోషిగా నిలబడ్డారు, అందుకు కోర్టు కూడా వంశీకి జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే ఈ నేపథ్యంలో వంశీని పరామర్శించడానికి జైలుకు వెళ్లిన జగన్ ఆయన ను ఉద్దేశించి ‘అందగాడు’ అంటూ వ్యాఖ్యానించారు.
Also Read – మామిడి రైతుల సమస్యలకు బదులు జగన్ హంగామా హైలైట్!
దీనితో అప్పటి వరకు వల్లభనేని వంశీగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన సదరు వ్యక్తి ఆనాటి నుంచి అందగాడు వంశీగా మారిపోయారు. అయితే వంశీ బాబు సామజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ బాబు కన్నా అందంగా ఉండడం వల్లనే వంశీ జైలు పాలయ్యాడు అంటూ వంశీ అవినీతి, అక్రమాలకు అందం అనే ముసుగు తొడిగారు జగన్.
ఇక అప్పటి నుంచి వైసీపీ కుటుంబం నుంచి ఏ ఒక్క నాయకుడు తమ అవినీతితో అరెస్టయిన సోషల్ మీడియాలో మరో వైసీపీ అందగాడు జైలుకెళ్లాడు అంటూ వైసీపీ పై వ్యంగ్యంగా పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. అయితే వంశీ బాటలోనే వైసీపీ లోని మరికొంతమంది అవినీతిపరులు అందగాళ్ళ రూపంలో కటకటాల వెనక్కి వెళ్లారు.
Also Read – వైసీపీ చీకటి మెయిల్స్…
ఇందులో ఇప్పటికే వైసీపీ కుటుంబ సభ్యులు చాలామంది సభ్యత్వం తీసుకున్నారు. వారిలో నెల్లూరి జిల్లా తాడిపర్తి వద్ద క్వాడ్జ్ లో అక్రమ తవ్వకాలు జరిపారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, అగ్రి గోల్డ్ వివాదంలో జోగి రమేష్, ఆయన కుమారుడు జోగి రాజీవ్, రాజు పై దాడి ఘటనలో మాజీ ఎంపీ నందిగామ సురేష్ లు అరెస్టు కాగా,
మాచర్ల ఎమ్మెల్యే పినెల్లి రామకృష్ణ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, బోరుగడ్డ అనిల్ కుమార్, వర్రా రవీంద్రా రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్, బాలాజీ గోవిందప్ప..ఇలా అనేకానేక మంది వైసీపీ కుటుంబ సభ్యులు అనేక కేసుల్లో అరెస్టయ్యి ఇప్పుడు అందగాళ్ళ అవతారం ఎత్తారు.
అయితే ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో ఎంట్రీ కోసం మరో వైసీపీ మాజీ మంత్రి, పేర్ని నాని కూడా పోటీపడుతున్నారు. రేషన్ బియ్యం అక్రమాల కేసులో పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు అతి త్వరలో వైసీపీ అందగాళ్ళ జాబితాలో పేరు నమోదు చేసుకోబోతున్నారు అంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆ అరెస్టు నుంచి ఎంతోకొంత సానుభూతి సంపాధించాలని పేర్ని నాని గత రెండు రోజుల నుంచి మీడియాలో మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ అధికారుల పై, కూటమి ప్రభుత్వం పై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే ఈ పేర్ని నాని తరువాత వరుసలో కూడా వైసీపీ కుటుంబం నుంచి మరికొంత మంది అందగాళ్ళ కోసం కోర్టులు, జైళ్లు వేచిచూస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం.
అయితే ఇందులో గుడివాడ బూతుల మంత్రిగా పేరుపొందిన మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే ఆడుదాం ఆంధ్రా పేరుతో నాటి పర్యాటక మంత్రి రోజా పై కూడా అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పెద్ది రెడ్డి భూదందాల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ విచారణకు ఆదేశించారు.
వైసీపీ సకల శాఖ మంత్రి సజ్జల గారు అయితే వైసీపీ నాయకులు అరెస్టవుతున్న సకల కేసులతో సంబంధాలను కలిగి ఉంటున్నారు. జిత్వాని కేసు నుంచి లిక్కర్ స్కాం వరకు సజ్జల పేరు గట్టిగా వినిపిస్తుంది. అయితే వీరంతా కూడా కోర్టుల నుంచి ముందస్తు బెయిల్లు తీసుకుంటూ అందగాళ్ళ లిస్ట్ లో తమ పేరు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇక మొన్నటివరకు వైసీపీ కి నెంబర్ 2 స్థానంలో ఉన్న మాజీ ఎంపీ విజయసాయి పై కూడా లిక్కర్ కేసులో, కాకినాడ పోర్ట్ వివాదంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే జగన్ సోదరుడు వైసీపీ కడప ఎంపీ వైస్ అవినాష్ రెడ్డి కూడా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొటున్నారు.
ఇక వైసీపీ పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే 16 నెలలు జైలు జీవితం అనుభవించి, పడకుండేళ్ళుగా బెయిలు మీద రాజకీయం చేస్తున్నారు. ఇలా వైసీపీ కుటుంబంలో అధినేత నుంచి నాయకుల వరకు అందరు అందగాళ్లే కావడంతో వైసీపీ ఒక అందమైన రాజకీయ కుటుంబం అయ్యింది.