YSRCP Spokesperson Shyamala

జగన్ భజన బృందంలో తాజాగా ఎంట్రీ తీసుకున్న ఒకప్పటి యాంకర్ శ్యామల…ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా ప్రమోషన్ దక్కించుకున్నారు. అయితే వైసీపీ అధికార ప్రతినిధి పదవి పొందడానికి జగన్ పెట్టిన అన్ని పరీక్షలలో శ్యామల ఉత్తీర్ణత సాధిస్తున్నారు అని ఆమె చేసే ప్రసంగాలను చూస్తే యిట్టె అర్థమయిపోతుంది.

తాజాగా హిందూపూర్ లో ఆమె చేసిన ఒక ప్రసంగాన్ని క్లుప్తంగా చూస్తే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద అరాచకాలు ఎక్కువయిపోయాయ్యి అంటూ పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read – బైజూస్ కాదు.. మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్.. ఇదే అవసరం!

అలాగే ఆ ఘటనల పై స్పందించినట్టు రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించడం లేదు అంటూ పవన్ పోస్టర్ తో ఈయన గారు మిస్సింగ్ ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అంటూ ప్రసంగిస్తూ వైసీపీ శ్రేణులలో మంచి జోష్ తెచ్చారు శ్యామల.

అలాగే ఈ సభ హిందూపూర్ వేదికగా జరగడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ పై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు శ్యామల. అయితే ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇంతలా తపనపడుతున్న ఈ వైసీపీ అధికార ప్రతినిధి గత ఐదేళ్లలో ఎక్కడున్నారో ఏమైనా చెప్పగలరా.? నాడు ఏనాడైనా ఏపీ సమస్యల పై కన్నెత్తైనా చూసారా.?

Also Read – మళ్ళీ యశోదలో కేసీఆర్‌.. వాట్ నెక్స్ట్?

నేడు రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అన్యాయాల గురించి గళం విప్పిన శ్యామల జగన్ సొంత సోదరి షర్మిల పై వైసీపీ చేస్తున్న నీచ రాజకీయం గురించి వివరించగలరా.? సాక్షి వేదికగా అమరావతి మహిళల పై వైసీపీ సానుభూతిపరులు జరిపిన అమానుషాన్ని శ్యామల ఖండించగలిగారా.?

జగన్ ప్రభుత్వ హయాంలో తన అక్కపై వైసీపీ శ్రేణుల అరాచకాలను అడ్డుకున్నందుకు ఒక 15 ఏళ్ళ చిన్నపిల్లాడిని వైసీపీ ఉన్మాదులు అగ్నికి ఆహుతిచేసారు.నాడు ఆ ఆడబిడ్దకు వైసీపీ మద్దతు దక్కిందా.? ఆ పైశాచకులకు శిక్ష పడిందా.? నాడు ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.

Also Read – నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది.. పరువు కూడా!

అయితే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కనీసం ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కాదు కదా, కనీసం ఒక ఖండన ప్రకటన కూడా ఇవ్వలేదు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్ మిస్సింగ్ అంటూ శ్యామల పోస్టర్ పెట్టారా.? ప్రజలను ప్రశ్నించారా.?

ఒక గులకరాయి తగిలితేనే జగన్ మీద హత్యా ప్రయత్నం అంటూ నానా హంగామా చేసిన వైసీపీ ఒక 15 ఏళ్ళ కుర్రాడి పై పెట్రోల్ పోసి తగలబెడితే కనీసం స్పందించలేకపోయింది. జగన్ సాక్షిగా అసెంబ్లీ వేదికగా వైసీపీ హయాంలో మహిళలకు జరిగిన అవమానాలు శ్యామల మరిచిపోయారా.?

గత కొన్నేళ్లుగా పులివెందులలో వైస్ కుటుంబం రాజకీయంగా లబ్ది పొందుతూనే ఉంది. వైస్ రాజశేఖర్ రెడ్డి నుంచి, వైస్ వివేకా నంద రెడ్డి , వైస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా తరాలుగా వైస్ కుటుంబాన్ని పులివెందుల ప్రజలు నెత్తిన పెట్టుకుంటూనే ఉన్నారు. మరి వైస్ జగన్ ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలోనే ఉంటున్నారా.?

ఆ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా నిలబెట్టగలిగారా.? వైసీపీ హయాంలో పులివెందులలో ఒక బస్ స్టాండ్ నిర్మించడానికే ముఖ్యమంత్రిగా జగన్ కు ఐదేళ్ల సమయం పట్టింది. ఇక అలాంటిది జగన్ హయాంలో పులివెందులలో ఎన్ని ప్రభుత్వ కళాశాలను నిర్మించారు, ఎన్ని ఆసుపత్రులను వృద్ధిలోకి తెచ్చారు.?




మరి ఈ ప్రశ్నలన్నింటికీ శ్యామల జవాబు చెప్పలరా.? అదే విధంగా వైసీపీని ప్రశ్నించగలరా.? రాజకీయాలలోకి వచ్చాక ప్రత్యర్థి పార్టీల నేతలను అడగాల్సినవే కాదు సొంత పార్టీ నేతల గురించి కూడా చెప్పాల్సినవి చాలానే ఉంటాయి మేడం.