
* చెన్నై మహానగరంలో అత్యంత ఖరీదైన ఏరియా ఏది అంటే టక్కున వినిపించే పేరు ఈ.సీ. రోడ్. మహాబలిపురం వెళ్లే దారిలో దాదాపు 30 కిలోమీటర్ల మేర విస్తరిల్లిన ఈసీ రోడ్డులో ఆవిర్భవించినదే “ఆదిత్య రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్”. చెన్నై రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని వ్యక్తిగా, శక్తిగా, వ్యవస్థగా ఎదిగిన ఆదిత్య రామ్ కు చెందిన “ఆదిత్య రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ” లో అంతర్భాగమే ఈ “ఆదిత్య రామ్ ఫిలిమ్స్ ఫిలిం సిటీ “.
* ఒకప్పుడు సినిమా వారితో, సినిమా షూటింగులతో కళకళలాడిన టి. నగర్, కోడంబాకం, వడపళని, వల్స రవాకం వంటి ఏరియాలు మితిమీరిన ట్రాఫిక్ ఆంక్షలతో దిబ్బందన స్థితికి చేరుకోవటంతో సినిమా వాళ్లు అటువైపు వెళ్ళటానికి ఏ మాత్రం సుముఖత చూపడంలేదు. అందుకు భిన్నంగా ప్రశాంత వాతావరణంలో బీచ్ కి అతి సమీపంలో ఆదిత్య రామ్ ఫిలిం సిటీ ఏర్పడటం దర్శక నిర్మాతలకు, హీరోలకు చాలా సౌకర్యవంతంగా ఉందట.
* నేటి తమిళ అగ్ర హీరోలైన రజనీకాంత్, కమలహాసన్, విజయ్, అజిత్, సూర్య ,కార్తీ, ధనుష్, శివ కార్తికేయ, విశాల్ వంటి హీరోలందరూ ఈసీ రోడ్డు పరిసరాల్లోనే నివసిస్తుండటం వల్ల ఆ హీరోలందరికీ ఇష్టమైన షూటింగ్ స్పాట్ అయింది ఆదిత్య రామ్ ఫిలిమ్స్ సిటీ. * ఇక సెంటిమెంట్ పరంగా చూసుకుంటే ఆనాటి కమలహాసన్ దశావతారం మొదలుకొని నేటి రజనీ కాంత్ జైలర్, షారూక్ ఖాన్ ల జవాన్ తో పాటూ తేరి, మెర్సల్, 24 సూర్య, ఆయిరత్తిల్ ఒరువన్, మావీరన్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల షూటింగ్స్ ఆదిత్య రామ్ ఫిలిం సిటీ లోనే జరగటం విశేషం. కాగా ప్రస్తుతం ఇద్దరు సూపర్ స్టార్స్ రజనీ కాంత్ అండ్ షారూక్ ఖాన్ లు నటించిన రెండు చిత్రాలు back to back సూపర్ హిట్స్ కావటంతో “ఆదిత్యా రామ్ ఫిలిమ్ సిటీ” తమిళ ఇండస్ట్రీ కి పెద్ద సెంటిమెంటల్ స్పాట్ అయింది . అత్యంత రద్దీగా మారిన చెన్నై మహానగరంలో ఎకరాల కొద్ది ఓపెన్ స్పేస్ దొరకడం దుర్లభం. ఒకే ప్రాంగణంలో ఒకదానికొకటి సంబంధం లేకుండా దూర దూరంగా ఎవరి సెట్టింగ్స్ వాళ్ళు నిర్మించుకుంటూ భారీ చిత్రాల నిర్మాణం చేయాలి అంటే అందుకు అనువైన ఏకైక ప్రాంతం ఆదిత్య రామ్ ఫిలిం సిటీ ఒక్కటే.
* దాదాపు ప్రముఖ హీరోల షూటింగ్ లు అన్నీ అక్కడే జరుగుతుండటంతో ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఒక షూటింగ్ స్పాట్ నుండి మరో షూటింగ్ కి షిఫ్ట్ అవ్వటానికి చాలా సౌలభ్యంగా ఫీల్ అవుతున్నారు. సో…ఇక్కడ షూటింగ్ జరిగితే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ తో పాటు ఇన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు ఉన్నందుకే ఈ రోజున చెన్నై మహానగరంలో ఆదిత్య రామ్ ఫిలిం సిటీ “బిజీయస్ట్ ఫిలిం జంక్షన్ ” గా పేరుపొందింది. అంతేకాకుండా షూటింగ్ ల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆదిత్య రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన “ఆదిత్యా రామ్ ” భారీ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో రెండు ఏసీ ఫ్లోర్స్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. కాబట్టి సెంటిమెంట్ అండ్ కంఫర్ట్ దృష్ట్యా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…