News Beat

“బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్” ట్రైలర్ విడుదల

ఇంద్రసేన, సంతోష్ రాజ్, నవీనా రెడ్డి, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్”. సస్పెన్స్ కామెడీ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడెమీ, ప్లాట్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్, తిరుమల మీడియా బ్యానర్స్ పై నిర్మాతలు అతీంద్ర అవినాష్ మరియు అలవలపాటి శేఖర్ ఈ
చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్” చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా “బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్” సినిమా ట్రైలర్ విడుదలైంది. ఫన్ సస్పెన్స్ డ్రామాతో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం
ఆసక్తికరంగా ఉంటూ ఆకట్టుకుంటోంది.

“బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.. ఇవాళ, రేపు తప్పు చేయకుండా బతకడం కష్టంరా.. కానీ పక్కోడు చేసిన తప్పును వాడుకుని బతకడం ఈజీ అనుకుంటారు రాజు, రమేష్ అనే ఇద్దరు యువకులు. ఇదే ఆలోచనతో సులువుగా డబ్బు సంపాదిస్తూ జల్సా చేస్తుంటారు. ఈ క్రమంలో వాళ్లు కామెడీ, యాక్షన్ చేయాల్సివస్తుంది. ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టర్స్ ను కూడా పరిచయం చేశారు. నేను చాలా అదృష్టవంతుడిని అని చెప్పుకున్న విలన్ సత్యప్రకాష్ తో ఇప్పటి నుంచి నీకు శని దశ మొదలైందిరా అంటారు హీరోలు.
బంగారు గుడ్లు పెట్టే బాతును చంపకూడదురా అది పెడతనే ఉండాలే మనం బాగుపడతనే ఉండాలే. అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ కంప్లీట్ అవుతుంది.

సస్పెన్స్ కామెడీ డ్రామా మూవీగా తెరకెక్కిన “బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్” సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ వస్తుందని చెబుతున్నారు దర్శకుడు రవి చావలి. మరి ఆ ట్విస్టులు ఎలా ఉంటాయో త్వరలోనే థియేటర్లలో సినిమా రిలీజ్ అవగానే చూసేయొచ్చు.

సత్య ప్రకాష్,‌ శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ – విజయ్ సి కుమార్, సంగీతం – బాంబే భోలే, పీఆర్వో – జీఎస్కే మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – దుర్గాప్రసాద్ శెట్టి , నిర్మాతలు – అతీంద్ర అవినాష్, శేఖర్ అలవలపాటి సమర్పణ – రాఘవేంద్ర రెడ్డి, దర్శకత్వం – రవి చావలి

Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

Is AA23 in Trouble? Allu Arjun’s Camp Responds

Reports about Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 hitting a roadblock have created fresh confusion…

8 hours ago

Reporting Live Review: An Absolute Disaster, Nothing Works

BOTTOM LINE An Absolute Disaster, Nothing Works PLATFORM Netflix RUNTIME 2 Hours What Is the…

8 hours ago