
ఈసందర్భంగా
హీరో సిద్దు జోన్నలగడ్డ మాట్లాడుతూ…‘తెలంగాణా యాస తో వస్తున్నాం ఎలా ఉంటుంది ఈ సినిమా నైజాం వరకూ మాకు ఎలాంటి సందేహాలు లేవు..కానీ ఆంధ్రలో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే డౌట్ ఉండేది. కానీ ఈరోజు విజయవాడలో ఆడియన్స్ తో కలసి చూసాక మంచి సినిమా ఎక్కడైనా మంచి సినిమానే అని ప్రేక్షకులు రుజువు చేసారు. చాలా ఆనందంగా ఉంది. డిజె టిల్లు అనే క్యారెక్టర్ రాయడం,చేయడం ఒక కత్తిమీద సాము లాంటిది. కానీ ప్రేక్షకులు మాకు మేం ఊహించిన దానికంటే పెద్ద విజయం అందించారు. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన కిక్ ఎప్పటికీ మరిచిపోలేను. మిమ్మల్ని ఏడిపించేంత నవ్విస్తాడు టిల్లు దానికి నాది గ్యారెంటీ అన్నారు.
దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ..‘ఈ విజయం తో ఏం మాట్లాడాలో అర్దం కావడం లేదు. ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్. మా నమ్మకాన్ని పదింతలు చేసి ప్రేక్షకులు మాకు విజయం అందించారు. ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేయడంలోనూ సిద్దూ పాత్ర చాలా ఉంది. విజయవాడ లో ప్రేక్షకుల రెస్పాన్స్ మా ఆనందాన్ని పదింతలు చేసింది అన్నారు.
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ…’నా మొదటి థియేటర్ విజిట్ ఇది. నా సినిమా ఆడియన్స్ తో చూడటం ఎప్పటికీ గుర్తుండి పోతుంది. థియేటర్ లో రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. డిజె టిల్లు ఒక సూపర్ ఫన్ రైడ్ .. ప్రేక్షకులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అన్నారు. ప్రేక్షకాభిమానుల ఆనందాన్ని తమ గుండెల్లో నింపుకొని మరిన్ని ధియేటర్ ల వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించింది చిత్ర యూనిట్.
Mahesh Babu and SS Rajamouli’s Varanasi is easily one of the biggest and most ambitious…
The fourth single, titled Bindass from Rajinikanth's most anticipated sequel Jailer 2, composed by Anirudh…