News Beat

విజయ్ ఆంటోనీ హీరోగా ‘హత్య’

డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా ‘హత్య’ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా..నాయిక రితికా సింగ్ సంధ్య అనే పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

‘1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా ‘హత్య’ సినిమా సాగనుంది. అందమైన మోడల్ లీల తన ఇంట్లో హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు అనేది మిస్టరీగా మారుతుంది. డిటెక్టివ్, పోలీస్ కోణంలో ఈ కేసు ఛేదనలో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు.

ADVERTISEMENT

ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ గతంలో విజయ్ ఆంటోనీతో కలిసి ‘విజయ్ రాఘవన్’ అనే చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ కాంబోలో ‘హత్య’ సినిమా నిర్మితమవుతుండగా..త్వరలో మరో రెండు ప్రాజెక్ట్ లు కలిసి చేస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు

Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

BB Telugu: Celebrities’ Unite To Checkmate Rohith

Bigg Boss Telugu Season 10 is taking an interesting turn, with the game becoming a…

3 hours ago

Over Delay: Is It Good or Bad For NTR?

It has been a long long time since Dragon, which marks tye collaboration of NTR…

4 hours ago