Press Release

ఈ నెల 30న ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ రిలీజ్ చేయనున్న ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం” ట్రైలర్

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం” ట్రైలర్
ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 30న “పుష్పక
విమానం” సినిమా ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది.
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరవుతున్నారు అల్లు అర్జున్. బన్నీ చేతుల
మీదుగా ట్రైలర్ రిలీజ్ అవడం “పుష్పక విమానం” యూనిట్ మొత్తానికి
సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ అంతా కలిసి థాంక్యూ బన్నీ
అన్నా అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు.

“పుష్పక విమానం” సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్
ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్, ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థలు ఈ
చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.

ADVERTISEMENT

“పుష్పక విమానం” చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు.
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది
హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా
నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్
ఎర్రబెల్లి లు నిర్మాతలు

టెక్నికల్ టీమ్: సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె
మీడియా,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని, సినిమాటోగ్రఫీ:
హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ :
రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్
దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ,
విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర.

Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

AK47 Confusion Turns Double Trouble for Venkatesh?

Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…

4 hours ago

H-4 EAD Update: USCIS Removes Automatic Extension

The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…

4 hours ago