
*నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సినీ అభిమానుల ఆనందోత్సాహాలను అంబరాన్ని తాకేలా చేసిన గీతం
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
“లాలా భీమ్లా…అడవి పులి”….డిజే వెర్షన్ లో ఈ రోజు విడుదల అయిన ‘భీమ్లా నాయక్‘ గీతం.
‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి గతనెల 7 వ తేదీన ఇదే “లాలా భీమ్లా అడవి పులి” గీతం విడుదల అయిన విషయం విదితమే. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం ఆయన తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేసిందీ గీతం. సామాజిక మాధ్యమాలలో సైతం హోరెత్తింది ఈ గీతం. ఇదే గీతాన్ని ఇప్పుడు డీజే వెర్షన్లో మరో మారు విడుదల చేసింది చిత్ర బృందం.
2021 కి వీడ్కోలు పలుకుతూ..నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విడుదల చేసిన ఈ గీతం సినీ అభిమానుల ఆనందోత్సాహాలను మరోమారు అంబరాన్ని తాకేలా చేసింది.
‘భీమ్లా నాయక్‘ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం మరింత హుషారు ను కలిగిస్తే మూడు నిమిషాల ముప్ఫై ఏడు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.
‘భీమ్లా నాయక్‘ చిత్రం ఫిబ్రవరి 25,2022 న విడుదల కానుంది. ఈ దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్:‘నవీన్ నూలి
ఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
Jana Sena Party’s proposed seat share for Andhra Pradesh urban local body elections has triggered…
Andhra Pradesh’s local body elections are becoming an important test for the relationship between Chandrababu…