
ఆదిత్ అరుణ్, మేఘా ఆకాష్ ల మీద చిత్రీకరించిన ఈ అందమైన లవ్ సాంగ్ ఎలా ఉందో చూస్తే…. ఆమని ఉంటే పక్కన…ఏమని చెప్పను భావన…పోతే మళ్లీ రాదనా…మళ్లీ మళ్లీ చూడనా..యే వానవిల్లో వేల రంగుల్లో కిందే వాలిందో…ఏ తీపిముల్లో నాటి గుండెల్లో నవ్వై పూసిందో..నీ ఊపిరేమో వెచ్చంగ మెల్లో ఇల్లా తాకిందో…నా ధ్యాస మొత్తం నీ మాయలోకే అల్లా జారిందో.. అడుగు, అడుగు నీతోనే..ఆకాశం అంచుకు వెళుతున్నానే..మలుపు, మలుపు నీతోనే మనసులో నే నీకో గుడి కడుతున్నాలే అంటూ ప్రేమను వర్షిస్తుందీ పాట.
హరి గౌర బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజిషన్ లో లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్ కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ”డియర్ మేఘ” సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టులో థియేటర్ లల్లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర,
సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ,
ఎడిటర్ – ప్రవీణ్ పూడి,
ఆర్ట్ డైరెక్టర్ – కె.వి రమణ,
పీఆర్వో – జి.ఎస్.కె మీడియా.
నిర్మాత : అర్జున్ దాస్యన్
రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…