Movie News

చిరంజీవి కల సినిమాలోనైనా నిజమవుతుంది

గత కొన్ని రోజుల నుండి, మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు మోహన్ రాజాతో సంతోషంగా లేరని… అందుకని ఆయన తో తలపెట్టిన లూసిఫర్ సినిమా రీమేక్ ప్రాజెక్టును నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రం ఇంకా కొనసాగుతోందని, ఈ చిత్రానికి ‘కింగ్‌మేకర్’ అనే టైటిల్‌ ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తాజా నివేదికలు వస్తున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్, మ్యూజిక్ కోసం మోహన్ రాజా పనిచేస్తున్నారని సమాచారం. సంగీత స్వరకర్తగా తమన్ ఉన్న ఈ చిత్రానికి ఇప్పటికే రెండు పాటలు ఖరారు చేశారని కూడా అంటున్నారు. సాహో ఫేమ్ సుజీత్ సైన్ మరియు వివి వినాయక్ గతంలో ఈ స్క్రిప్ట్‌ మీద పనిచేసినప్పటికీ మెగాస్టార్‌ను సంతృప్తిపరచలేకపోయారు.

ADVERTISEMENT

ఇకపోతే… సోషల్ మీడియాలో అకారణంగా మోకాలికి బోడిగుండుకి లింక్ పెట్టడం సాధారణమే. ఈ టైటిల్ కు సంబంధించిన వార్తలు రాగానే కొందరు 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారని… అప్పట్లో కింగ్ కాకపోతే కనీసం కింగ్ మేకర్ కావడం ఖాయమని చిరంజీవి తన క్లోజ్ సర్కిల్ తో అనేవారని… ఆ కల కనీసం ఇలా అయినా నెరవేరుతుందని గిట్టని వారు ఎద్దేవా చేస్తున్నారు.

ఆ విషయం పక్కన పెడితే… లూసిఫర్ రీమేక్ పై క్లారిటీ కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి తగ్గి… ఆచార్య షూటింగ్ పూర్తయ్యి విడుదలైతే గానీ వచ్చేట్టు లేదు. ఈ సినిమా కాకుండా చిరంజీవి ఇప్పటికే మెహర్ రమేష్, బాబీ దర్శకత్వంలో మరో రెండు సినిమాలకు ఒకే చెప్పారు. ఇందులో ఏది ముందూ ఏది వెనకాల అనేది తేలాల్సి ఉంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Pics: Prakriti Turns Traditional Glam Extra Bold!

Prakriti Pavani turns up the festive voltage in this striking red lehenga set that blends…

19 minutes ago

Ramayana Controversy: Warnings of Bigger Industry Damage

Advance bookings for Bollywood's magnum opus Ramayana were set to open today (October 20) at…

39 minutes ago