
ఇటీవలే వైఎస్సాఆర్ కాంగ్రెస్ తరుపున ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వీరవరంలో ఎంపీ తోట కుటుంబాన్ని కలిసి వెళ్లారు. తాజాగా తోట నరసింహం కుటుంబసభ్యులను జనసేన పార్టీ నాయకులు శనివారం కలుసుకున్నారు. పవన్‌కళ్యాణ్ సన్నిహితుడైన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బ్రహ్మదేవ్, రాష్ట్ర కోశాధికారి పంతం నానాజీ, తులసిరామ్ ఇంకా పలువురు జనసైనికులు ఎంపీ తోట కుటుంబసభ్యులను కలిశారు. తోట నరసింహం ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆయన కుటుంబసభ్యులు జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఎమ్మెల్యే సీటు అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ తోటకు తెలియజేశారు. దీనితో తోట నరసింహం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఉభయ గోదావరి జిల్లాలలో కాపుల ఓట్ల మీద జనసేన భారీగా ఆశలు పెట్టుకుంది. అదే సామాజిక వర్గానికి చెందిన తోట నరసింహన్ని పార్టీలోనికి తీసుకువస్తే ఆ పార్టీలో తమ ఇమేజ్ పెరుగుతుందని జనసేన భావిస్తుంది. అందుకే ఆయనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.
As we had been extensively reporting for the last few hours, Tamil Nadu assembly elections…
Recent data from Digital Trends highlights the global streaming race. The numbers show how competitive…