
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా 15 నుండి ప్రమోషన్లు మొదలుపెడుతుంది. సంక్రాంతి కి విడుదల అయ్యే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ రోజున విడుదల చెయ్యబోతున్నారు. ఆ రోజే ఆ చిత్రం టైటిల్ ని కూడా కంఫర్మ్ చెయ్యబోతున్నారు. వైకుంఠపురంలో అనే టైటిల్ కంఫర్మ్ అయ్యిందని వదంతులు వినిపిస్తున్నాయి. అలాగే సెప్టెంబర్ 13న విడుదలయ్యే వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా కూడా అదే రోజు తన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చెయ్యనున్నారు.
రామ్ చరణ్ తదుపరి చిత్రం ఆర్ఆర్ఆర్ దేశభక్తి బ్యాక్ డ్రాప్ కావడంతో ఆ చిత్రబృందం కూడా ఏదో ఒకటి విడుదల చేస్తుందని వారు ఆశిస్తున్నారు. అయితే మిగతావన్నీ అధికారికంగా కంఫర్మ్ అయినా ఆర్ఆర్ఆర్ బృందం మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. వారు కూడా ప్రకటిస్తే సంపూర్ణం అవుతుంది. మొత్తానికి ఈ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మెగా అభిమానులకు పండుగ అని చెప్పుకోవాలి. ఒకే ఫ్యామిలీ నుండి అనేక మంది హీరోలు ఉంటే ఆ ఫ్యామిలీ అభిమానులకు ఉండే అడ్వాంటేజ్ అలా ఉంటుంది మరి.
Nani’s speech at The Paradise pre-release event was less about the usual pre-release hype and…
Allu Arjun-Atlee’s Raaka has created huge curiosity with its ambitious scale, and the recently released…