
ఇది సోషల్ మీడియా యుగం. ఈ కాలానికి తగ్గట్టు ఓ డిజిటల్ ఐడియాకు అనుగుణంగా అదిరిపోయే పాయింట్ తో అద్భుతమైన కంటెంట్ తో ఈ నెల 28 న ఈ సినిమా రాబోతుంది. మనవాళ్ళు అంతా తెలుగులో గొప్ప సినిమాలు రావు అంటారు గాని, నిజంగా ఇలాంటి గొప్ప సినిమా వచ్చినప్పుడు ఎందుకు చూడరు. మంచి సినిమా చూడాలనుకునే వారు ఆహా లో ఈ నెల 28న ఈ సినిమాని చూడండి. ప్రతి పాత్రకు ఒక కథ ఉంటుంది. అసలు ఇలాంటి కథలో అద్భుతమైన ఎమోషన్స్ అండ్ సస్పెన్స్ ను పెట్టడం అంటే మాటలా. అనుభూతితో కూడా ఓ విషాదపు ఫ్యామిలీ కథను (నరేష్ – పవిత్రా లోకేష్ పాత్రల కథ) థ్రిల్ చేస్తూ చెప్పడం.. పైగా అనేక భావోద్వేగాల సమ్మేళనంలా సాగిన ఈ సినిమా తెలుగు న్యాచురల్ సినిమాల్లో మరో సినిమాగా నిలిచిపోతుంది.
ఇక ఈ సినిమాలో చివరిదాకా ఏం జరుగుతుందో.. హీరో అలీ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే పాయింట్ ను అండ్ ట్విస్ట్ ను దర్శకుడు చాలా ఇంట్రస్ట్ గా చెప్పాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా పై ముఖ్యంగా అలీ నటన పై, నరేష్ – పవిత్రా లోకేష్ ల మధ్య కెమిస్ట్రీ పై గౌరవం పెరుగుతుంది. సోషల్ మీడియాకి సంబంధించిన కథతో ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈ నెల 28న రాబోతున్న ఈ సినిమాని చూసి మంచి అనుభూతి పొందండి. ఈ సినిమాలో ఆలీ హీరోగా, నరేష్ – పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల దారులుగా నటిస్తుండగా మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య, ప్రణవి మానుకొండ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
Regional slang can make a performance feel real. But when an actor tries too hard…
The legal battle over Kala Hiran: The Battle for Legacy has taken another turn. The…