News Beat

Made VBVK To Encourage New Talent Directors: Bunny Vas

కొత్తగా డైరెక్షన్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఈ సినిమాను తీశాను.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాపై నిర్మాత బన్నీ వాసు

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 18న విడుదలైంది. కిరణ్ అబ్బవరం హీరోగా, క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్‌గా జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన ఈ “వినరో భాగ్యము విష్ణు కథ” థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.

ADVERTISEMENT

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘నిర్మాతగా నేను ఈ సినిమా పట్ల హ్యాపీగా ఉంది. నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది. కొత్త వారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని అంతా అడుగుతున్నారు. అరవింద్ గారి వద్ద ఉన్న క్రమశిక్షణ వల్లే ఖర్చు హద్దుల్లోనే ఉండగలిగింది. అదే మా టీం సక్సెస్ సీక్రెట్. మా టీం వల్లే ఇదంతా సాధ్యమైంది. చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు తీసినప్పుడు లగ్జరీని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. గీతా ఆర్ట్స్‌లో ఆ గీత కరెక్ట్‌గా ఉంటుంది. ఈ సినిమాను మా డైరెక్టర్ గారు తీర్చిదిద్దిన విధానం చూసి ముచ్చటేసింది. నేను ఎప్పటి నుంచో అనుకున్న సీన్లను అద్భుతంగా తీశారు. ఆర్ఆర్‌లో విష్ణుతత్త్వాన్ని చెబుతూ వచ్చారు. ఈ సినిమాలోని ట్విస్టులు, కథ, నిడివి విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ నేను మాత్రం సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడిప్పుడే కేజీయఫ్, విక్రమ్ వంటి ఫార్మాట్లకు అలవాటుపడుతున్నారు.. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సినిమా తీయాలని కొత్తగా డైరెక్ట్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీశాం. చేతన్ భరద్వాజ్‌లో ఇంత టాలెంట్ ఉందని నాకు ఇంతకు ముందు తెలియదు. కిరణ్ అబ్బవరం మాకు ఎంతో సహకరించారు. మా ప్రతీ మాటను అర్థం చేసుకున్నారు. కిరణ్ ఎంతో హంబుల్‌గా ఉంటారు. మా ఫ్యామిలీ మెంబర్‌లా కలిసిపోయారు. కశ్మీర చాలా బిజీగా ఉన్నా కూడా మాకు ఎంతో టైం ఇచ్చారు.

నిర్మాత ఎస్‌.కె.ఎన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చాలా కొత్తగా ఉంది. ఓటీటీలో డబ్బింగ్ వర్షన్ సినిమాలు వచ్చాయ్.. అద్భుతంగా ఉంది చూశారా? అని అనే వాళ్లకు.. ఈ సినిమాను వచ్చినప్పుడు బుక్ మై షోలో బుక్ చేసుకుని చూడండి. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. అరవింద్ గారి స్కూల్‌ నుంచి వచ్చిన బన్నీ వాస్ మంచి సినిమాలు తీస్తున్నారు. వాసుకి మంచి జడ్జ్‌మెంట్ ఉంటుంది. ఆయన తీసిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎంగేజింగ్‌గా ఉంటుంది. వాసు సినిమాల్లో కథే హీరో. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. అందరికీ నమ్మకం ఉంటుంది. కొత్త డైరెక్టర్ వచ్చాడు.. కథ చెప్పాడు.. బాగుందని వాసు చెప్పినప్పుడే నేను ఈ సినిమా హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను. చాలా సినిమాలు సోమ,మంగళవారం వచ్చే సరికి బ్రేక్ అవుతాయి.. కానీ మా సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. ఇలాంటి కథలను చిన్న స్క్రీన్ మీద, ఓటీటీల్లో చూడటం కంటే.. థియేటర్లో చూసినప్పుడు వచ్చే మజా వేరేలా ఉంటుంది. ప్రతీ అరగంటకు జానర్ మార్చుకుంటూ సినిమా తీయడం మామూలు విషయం కాదు. మా డైరెక్టర్‌ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. మా హీరోయిన్‌ కశ్మీర మున్ముందు మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం వల్లే ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. పిల్లలందరికీ ఈ సినిమాను చూపించండి’ అని అన్నారు.

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘సక్సెస్ మీట్‌లు పెట్టినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. సినిమా ఆడకపోతే.. నేను బయటకు కనిపించను. ఆడియెన్స్‌ ఇచ్చే రిజల్ట్‌ను నేను గౌరవిస్తాను. ఇప్పటి వరకు నేను ఐదు సినిమాలు చేశాను. ఏ సినిమా గురించి కూడా ఇలా మీడియా వచ్చి మాట్లాడలేదు. ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా సినిమాను చూసి మెచ్చుకున్నారు. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే మాట నుంచి ఈ సినిమా మొదలవుతుంది. పిల్లలను ఎలా పెంచాలి.. ఎలాంటి మాటలు చెప్పాలి అని తెలియజేసేదే విష్ణు కథ. ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు నందు అన్న, నిర్మాత వాసు అన్నకు థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. చాలా మంచి సినిమాను తీశాం. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా. మంచి మాటలు వింటారు. దేశం గురించి చెప్పాం. మీ అందరికీ నచ్చుతుంది. సినిమాను చూసి ఇంత ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

హీరోయిన్ క‌శ్మీర ప‌ర్ధేశీ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థాంక్స్. ఇలాంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. మొదటి సినిమా వర్కౌట్ కాకపోతే.. రెండో చాన్స్ ఇవ్వరు. కానీ నాకు గీతా ఆర్ట్స్ అవకాశం ఇచ్చింది. ఇంత మంచి చిత్రంలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించారు. ప్రతీ ఒక్కరూ నన్ను దర్శన అని పిలుస్తున్నారు’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘ఒక సహాయం ఎన్ని మలుపు తిరుగుతుందో డైరెక్టర్ నంద కిషోర్ చక్కగా చూపించారు. ప్రతీ ఒక్కరూ సినిమాను రెండు మూడు సార్లు చూస్తున్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. ఇంత మంచి సినిమాలో పని చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ.. ‘ఇది కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. ఆడపిల్ల కంట్లో నీళ్లు వస్తే విష్ణు ఏం చేస్తారో చెప్పే కథ ఇది. మంచి అనేది వ్యాప్తి చెందడానికి టైం పడుతుంది. కానీ అది స్టార్ట్ అయితే ఆగదు. ఆ డైలాగ్‌ మాకు సరిగ్గా సరిపోద్ది’ అని అన్నారు

Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

GG’s Favourite Out of T20I Squad? Yash Replaces Him

Harshit Rana has been ruled out of India’s upcoming T20I series against Afghanistan and the…

21 minutes ago

‘సర్దార్ 2’ సినిమా రివ్యూ: సరుకు లేని సినిమా!

చిత్రం: సర్దార్ 2 M9 రేటింగ్: 1.25/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 10, 2026 తారాగణం: కార్తీ, మాళవిక మోహనన్,…

40 minutes ago