
ఓ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కథానాయకుడు రంగంలోకి దిగినట్లు పోస్టర్ ద్వారా తెలుస్తున్నది. పోస్టర్ లో మురళీ శర్మ, రాధికా శరత్ కుమార్ లాంటి పాత్రలను రివీల్ చేశారు. వీళ్లను అనుమానితులుగా హీరో భావిస్తున్నట్లు ఉంది. హ్యాట్ , కోటుతో డిటెక్టివ్ లుక్ లో సహజంగా కనిపిస్తున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన కెరీర్ లో ఇదొక డిఫరెంట్ ఫిలిం అవుతుందని అనుకోవచ్చు. ‘1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా ‘హత్య’ సినిమా సాగనుంది. ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు.
ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ గతంలో విజయ్ ఆంటోనీతో కలిసి ‘విజయ్ రాఘవన్’ అనే చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ కాంబోలో ‘హత్య’ సినిమా నిర్మితమవుతుండగా..త్వరలో మరో రెండు ప్రాజెక్ట్ లు కలిసి చేస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.
The Paradise may have ended up disappointing many viewers, but there is one thing the…
నేడు మదనపల్లిలో జరిగిన రాయలసీమ ఉద్యాన హబ్, దేశంలో మొట్ట మొదటి ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ శంకుస్థాపన కార్యక్రమ…