
ఈ సంఘటనను చూసిన తరువాత కూడా చంద్రబాబు ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారని, మా పార్టీ నుండి ఎవ్వరు టిడిపిలోకి చేరడానికి సుముఖంగా లేరని రోజా వ్యాఖ్యానించారు. మరి చేరిన నలుగురు ఏ పార్టీకి చెందిన వారో! రోజులు మారాయి రోజా గారు ఒక్కసారి తిరిగి చూసుకోండి, ఇకనైనా రోజా కళ్ళు తెరిచి చూడాలని కోరుకొంటున్నాము అంటున్నారు అధికార పార్టీ నేతలు.
తెలంగాణాలో టిడిపి నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు వారందరికి చంద్రబాబు నాయకత్వం మీద, పార్టీ మీద నమ్మకం లేకనే పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్న రోజా గారు, అదే విషయం తన పార్టీ దాకా వస్తే, వైసీపీ నేతలను అధికార పార్టీ భయపెట్టో లేక ప్రలోభపెట్టో వారికి ‘పసుపు’ కండువాలు కప్పారని విమర్శలు చేస్తున్నారు. “కొంతకాలానికి తెలంగాణాలో టిడిపి ఖాళీ అయిపోతుంది” అన్న రోజాకు ముందు ఆంధ్రాలో తన పార్టీ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలని పలువురు టిడిపి నేతలు ఉచిత సలాహాలు ఇస్తున్నారు.
రోజా కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యురాలే కదా! మరి తను ఎవరి ప్రలోభాలకు, ఎవరి బెదిరింపులకు భయపడి పార్టీ మారారో చెప్పాలని అధికార పార్టీ నేతలు సందిస్తున్న ప్రశ్నలకు రోజా గారి జవాబుందా? జగన్ మాదిరే అనాలోచిత, అసందర్భ వ్యాఖ్యలకు రోజా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…