“1 నేనొక్కడినే” సినిమా ‘క్రేజ్’కు నిదర్శనం!

అమెరికా వ్యాప్తంగా మంచు వర్షం కురుస్తున్న రోజులవి. దీంతో ఓ తెలుగు సినిమాకు ఏ స్థాయిలో ప్రేక్షకులు హాజరు అవుతారనే సందిగ్ధం ఆ సినిమా నిర్మాతలతో పాటు సర్వత్రా నెలకొంది. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ప్రీమియర్ షోకు అభిమానగణం విశేష సంఖ్యలో హాజరై బ్రహ్మరథం పట్టారు. అప్పట్లో ప్రీమియర్ షో కలెక్షన్స్ లో కొత్త రికార్డులు సృష్టించిన సినిమా అది.

సుకుమార్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన “1 నేనొక్కడినే” సినిమా విడుదలైన నేపధ్యంలో ప్రిన్స్ అభిమానులు పండగ చేసుకుంటూ ధియేటర్ల వద్ద సందడి చేస్తున్న తరుణాలవి. జనవరి 9వ తేదీ అర్థరాత్రే యుఎస్ లో ప్రీమియర్ షో ద్వారా మహేష్ హంగామా షురూ అయ్యింది. మంచు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తన అభిమాన హీరో నటవిశ్వరూపాన్ని వెండితెరపై వీక్షించిన క్షణాలవి. అలా 2014, జనవరి 10వ తేదీన విడుదలైన “1 నేనొక్కడినే” సినిమా మహేష్ కెరీర్ లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చిత్రంగా నిలిచింది.

ADVERTISEMENT

అంతేకాదు, ప్రిన్స్ అభిమానులు గర్వంగా చెప్పుకునే సినిమాగా “1 నేనొక్కడినే” నిలబడింది. కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపినప్పటికీ, ఈ సినిమాను ఇష్టపడిన ప్రేక్షకుల సంఖ్య కోకొల్లలు. “1 నేనొక్కడినే” సినిమా పేరు చెబితే పులకించే ప్రిన్స్ అభిమానగణానికి కొదవ లేదు. తెలుగు సినీ రూపురేఖలు మార్చడానికి వచ్చిన సినిమాగా కీర్తినందుకున్న ఈ సినిమా డివిడి, బ్లూరేల కోసం ఇప్పటికీ ప్రిన్స్ అభిమానులు సదరు నిర్మాతలైన 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు ట్వీట్లు చేస్తున్నారంటే ఏ రేంజ్ లో వారిని అలరించిందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా అమితమైన క్రేజ్ తో విడుదలైన “1 నేనొక్కడినే” సినిమా, నేటికి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రిన్స్ అభిమానగణం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. హిట్టైనా, ఫ్లాప్ అయినా ఇలాంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అవసరమంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే “నాన్నకు ప్రేమతో” సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణం కూడా “1 నేనొక్కడినే” సినిమానే! సుకుమార్ అద్వితీయ ప్రతిభకు, మహేష్ అమోఘమైన అభినయానికి నిదర్శనం ఈ “1 నేనొక్కడినే.” ఈ సారి కమర్షియల్ గా కూడా సక్సెస్ కొట్టే విధంగా ఇలాంటి సినిమాను నిర్మిస్తామని, ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర ప్రకటించారు.

Share
Published by

Recent Posts

Allari Naresh’s ROM BO: First Weekend

Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…

12 minutes ago

Vijay’s Assembly Statement: A Timeline With Political Fire

Some political timelines are just numbers. This one carries a lot more weight. Tamil Nadu…

24 minutes ago