“1 నేనొక్కడినే” సుకుమార్ కు అంత రేంజ్ ఇచ్చిందా?

తెలుగు సినీ ప్రేక్షకులను తమ ‘బ్రాండ్’తో ధియేటర్లకు రప్పించే దర్శకులు అతి తక్కువ. అందులో మొదటి పేరు రాజమౌళిది. ఆ తర్వాత త్రివిక్రమ్, పూరీ జగన్నాధ్, క్రిష్, సుకుమార్, కృష్ణవంశీ వంటి అతి కొద్ది మంది దర్శకులు ఉన్నారు. జాబితాలో ఎక్కడో ఉన్న సుకుమార్ పేరు “1 నేనొక్కడినే” సినిమా తర్వాత 2వ స్థానానికి చేరుకుందని తాజాగా జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి.

సుకుమార్ లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ తో “నాన్నకు ప్రేమతో…” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ టీజర్ యూ ట్యూబ్ లో సంచలనంగా నిలిచిన విషయం తెలిసిందే. గతంలో జూనియర్ చిత్రాల టీజర్లకు వచ్చిన స్పందనతో పోలిస్తే “నాన్నకు ప్రేమతో…” సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంపేర్ చేయగలిగింది కాదు. మరి అంతలా రావడానికి కారణం… “1 & ఓన్లీ” సుకుమార్..! అయన బ్రాండ్ తో “నాన్నకు ప్రేమతో…” టీజర్ చెలరేగిపోయింది.

అలాగే గత శుక్రవారం విడుదలైన చిన్నచిత్రం “కుమారి 21ఎఫ్” వీకెండ్ లో దాదాపు 7 కోట్లు కొల్లగొట్టడానికి కారణం… ఈ సినిమా సుకుమార్ ‘బ్రాండ్’ మీద విడుదల కావడమే. ‘ఆర్య’ సినిమా మొదలుకొని ‘1 నేనొక్కడినే’ వరకు సుకుమార్ దర్శకత్వం వహించిన అన్నీ సినిమాల్లో కామన్ గా కనిపించే పాయింట్ “కొత్తదనం.” అది కాస్తా “1 నేనొక్కడినే” సినిమాతో పతాక స్థాయికు చేరుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లకొట్టలేకపోయినప్పటికీ, దర్శకుడిగా సుకుమార్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టతలను తెచ్చిపెట్టింది, అలాగే విలువ కట్టలేని విశేషమైన అభిమానఘణాన్ని సుకుమార్ వశం చేసింది.

అవును… “1 నేనొక్కడినే” తర్వాత సుకుమార్ రేంజ్ వేరు. ఆ సినిమాలో సుకుమార్ తెరకెక్కించిన ప్రతి షాట్ అద్భుతం. అయన ఆలోచనలకు, కళా ప్రతిభకు రాజమౌళి వంటి దర్శకులు సైతం జేజేలు పలికారు. అందుకే “కుమారి 21ఎఫ్” సినిమాలో హీరోయిన్ డోస్ కాస్తా ఎక్కువైనప్పటికీ, అది “కొత్తదనం” క్యాటగిరిలోకి వెళ్ళిపోయి సినిమాను నిలబెట్టింది. టాక్ తో సంబంధం లేకుండా “కుమారి 21ఎఫ్” బాక్సాఫీస్ వద్ద కోట్లు కురుపిస్తోంది. బహుశా “1 నేనొక్కడినే” సినిమాకు ఇవ్వలేని సక్సెస్ ను ప్రేక్షకులు “కుమారి 21ఎఫ్” ద్వారా ఇస్తున్నారేమో..!

Share
Published by

Recent Posts

గీతలు దాటుతున్న రాజకీయ భాష…పాపం ఎవరిదీ.?

రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి…

7 minutes ago

RC17 Finally Moves Forward: Sukumar Locks Final Draft

Ram Charan and Sukumar’s RC17 has finally taken a major step forward. The latest update…

17 minutes ago