Telugu

అల్లుడిగారిని బాధ పెట్టినందుకు 10 మంది అరెస్టు

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తనకు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయని, ఇన్‌స్టాగ్రామ్‌లో కొంత మంది పనిగట్టుకుని ఆయన్ని టార్గెట్ చేస్తున్నారని, అసభ్యకర కామెంట్లు పెడుతున్నారని ఆరోపించారు. తొలుత వాటిని పెద్దగా పట్టించుకోకపోయినా ఆ తరువాత అవి ఎక్కువ కావడంతో ఈ కామెంట్లను భరించలేక ఆయన పోలీసులను ఆశ్రయించారు.

ADVERTISEMENT

కళ్యాణ్ దేవ్ ఇచ్చిన కంప్లయింట్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పోస్ట్ చేసే ఫొటోల కింద ఓ 10 మంది వ్యక్తులు దారుణమైన కామెంట్లు చేస్తున్నారని.. తన కుటుంబసభ్యులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కళ్యాణ్ దేవ్ ఫిర్యాదు చేశారు. ఇటీవలే శ్రీజ మొదటి భర్తకు రెండో వివాహం జరగడంతో ఈ వెకిలి చేష్టలు ఎక్కువయ్యాట. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ 10 మందిని గుర్తించారు.

వారి వివరాలు, ఐపీ అడ్రస్‌లు కావాలని ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ద్వారా సేకరించారు. ఆ వివరాలు వారి నుండి సేకరించి అరెస్టు చేశారు. గత ఏడాదికళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ తరువాత ఆయన ఇంకో సినిమా ప్రకటించినా ఇప్పటివరకూ అది తెరకెక్కలేదు. గత ఏడాది చివర్లో శ్రీజా – కళ్యాణ్ దేవ్ దంపతులకు ఒక కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

AK47: Paradise, Ranabaali Hangover Hits Trivikram’s Film

The combination of Venkatesh and Trivikram Srinivas was expected to create strong buzz from the…

4 hours ago

Nayanthara Joins Rajinikanth’s Action Film Dharman

Rajinikanth is currently enjoying the box-office response to his Jailer 2 across the world. Meanwhile,…

5 hours ago