ఫిబ్రవరి 24 టు మే 29 – 3 నెలలు పండగే పండగ!

క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. రానున్న మూడు నెలల్లో ఓ నాలుగైదు రోజులు మినహాయిస్తే సాయంత్ర సమయాల్లో కాస్త సమయాన్ని వీలు చేసుకోవడమే తరువాయి! ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులంతా ప్రేక్షకులను సమ్మోహితులను చేయడానికి సిద్ధమవుతున్నవారు.

ADVERTISEMENT

ఫిబ్రవరి 24వ తేదీ నుండి ‘ఆసియా కప్’ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్ కానుంది. 24వ తేదీతో ప్రారంభం కానున్న ఆసియా కప్ పండగ మార్చి 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఇది ముగిసిన మరికొద్ది రోజులకే టీ20 ప్రపంచ కప్ సందడి చేయనుంది. మార్చి 8వ తేదీన క్వాలిఫైయర్ మ్యాచ్ లతో ప్రారంభమై ఏప్రిల్ 3వ తేదీన జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది.

ఇలా వరుసగా ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లతో పాటు ప్రతి ఏడాది బీసీసీఐ నిర్వహించే ఇండియన్ క్రికెట్ పండుగ ‘ఐపీఎల్’ హంగామా ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభం కానుంది. ప్రపంచ మేటి క్రికెటర్లతో పాటు భారత యువకెరటాలు పాల్గొనే ఐపీఎల్ పై ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మే 29న జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తో మూడు నెలల టీ20 క్రికెట్ పండుగకు శుభంకార్డు పడనుంది.

క్లుప్తంగా సిరీస్ షెడ్యూల్ లను పరిశీలిస్తే…

ఆసియా కప్ – ఫిబ్రవరి 24 టు మార్చి 3

వరల్డ్ కప్ – మార్చి 8 టు ఏప్రిల్ 3

ఐపీఎల్ – ఏప్రిల్ 9 టు మే 29.

Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

4 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

7 hours ago