
అయితే ఆ సినిమా ఇప్పటికే ప్లాప్ టాక్ రాబట్టుకుంది. మరో రెండు చిన్న సినిమాలు …. మిస్ మ్యాచ్, భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు సినిమాలు అయితే కనీసం సోయలో లేకుండా పోయాయి. మార్నింగ్ షోలకే థియేటర్లకు జనాలు లేరు. సినిమా టాక్ అండ్ రివ్యూస్ కూడా దానికి తగ్గట్టుగానే వస్తున్నాయి. దీనితో మరో వారాంతం బోర్ అనే చెప్పుకోవాలి.
ఇది ఇలా ఉండగా మథనం అనే సినిమా కేవలం అమెరికాలో మాత్రమే విడుదల అవుతుంది. రేపు మీడియాకు హైదరాబాద్ లో స్పెషల్ షో వేస్తున్నారు నిర్మాతలు. మొత్తానికి ఈ వారాంతం సినీ ప్రేక్షకులు సినిమాలు కాకుండా మరో కాలక్షేపం వెతుక్కోవాల్సిందే.
వెంకటేష్, నాగచైతన్యలు నటించిన వెంకీ మామ చిత్రం వచ్చే వారం విడుదల అవుతుంది. 13న వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా కాలం తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న స్టార్ సినిమా కావడంతో ఓపెనింగ్స్ బావుంటాయని నిర్మాతలు భావిస్తున్నారు. మరి 2019 చివరి నెల ఒక సాలిడ్ హిట్ పడుతుందేమో చూడాలి.
A car accident involving Meghana, daughter-in-law of former YSRCP minister Jogi Ramesh, has raised concerns…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకు మధ్య ఆస్తి వివాదాలు అందరికీ తెలిసిందే. అయితే ఆ వివాదాలు…