
ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగులు వేస్తున్న సూపర్ హీరో తేజా సజ్జ తన ఇనీషియేటివ్ నిర్ణయంతో అగ్ర నటులను కూడా ఆలోచింపచేసారు. ఇటువంటి విషయాలలో ప్రభుత్వాలు పట్టుబడితేనో, తమ పవర్ చూపిస్తేనో కానీ అడుగుముందుకు వేయని సినీ ఇండస్ట్రీ ప్రముఖుల కళ్ళు తెరిపించారు తేజ.
తెలంగాణలో సినిమా విడుదల సమయంలో ఆ మూవీ, ప్రభుత్వం నుండి అదనపు బెనిఫ్ట్స్ పొందాలి అంటే అందుకు ప్రతిగా ఆ మూవీ హీరో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ‘డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ సమాజం’ అనే సోషల్ వెల్ ఫెర్ కార్యక్రమానికి తమ గళం వినిపించాలి అనే షరతు విధించడం దాన్ని విధిగా హీరోలు ఆచరించడం చూస్తూనే ఉన్నాం.
కానీ అదే సినీ ప్రముఖులు తమ సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం, బెనిఫిట్ షోల అనుమతి కోసం ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ ఇక్కడి ప్రభుత్వానికి కానీ ప్రజలకు గాని ప్రతిగా చేస్తుంది శూన్యమనే చెప్పాలి. అయితే తెలంగాణ సమాజం మీద మాత్రమే వీరికి ఎందుకింత బాధ్యత.?
ఏపీ ప్రజల పట్ల ఆ ఆదరణ ఇండస్ట్రీ కి ఎందుకు కొరవడింది.? అనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ‘నేనున్నా ఆంధ్రప్రదేశ్’ అంటూ ఏపీ ప్రభుత్వానికి భరోసా ఇచ్చారు హీరో తేజ సజ్జ. ఇందుకు గాను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఏవైర్నెస్ కార్యక్రమానికి మద్దతుగా ఒక వీడియో విడుదల చేసారు.
”ఏం కాదులే అని సోషల్ మీడియాలో ఆడపిల్లల ఫోటోలు, వీడియోల కింద బాడ్ కామెంట్స్ చేయకండి. ఏదైనా జరగని విషయాన్ని జరిగినట్టు చిత్రీకరించి ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేసినా ఆ కామెంట్స్ వారి మైండ్ సెట్ ను, ఆ కుటుంబాలను చాల డిస్టర్బ్ చేస్తాయి. వీటిని మానుకుందాం… ఇక నుంచి సోషల్ మీడియాను మంచికే వాడుకుందాం”..అంటూ ఒక సందేశాత్మక వీడియోను విడుదల చేసి శభాష్ తేజ అనిపించుకున్నారు.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ ముందడుగులో నేను కూడా ఒక భాగమైనందుకు గర్విస్తున్నా…అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సోషల్ మీడియా ఏవైర్నెస్ కార్యక్రమంలో పాలుపంచుకుని తన పెద్ద మనసు చాటుకున్నారు ఈ చిన్న హీరో. వీరి బాటలోనే మరికొంతమంది సెలబ్రేటిస్ కూడా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి ఆలోచనకు ముందుకొచ్చి మద్దతు పలకాలి అని ఆశిద్దాం.
Ask people who directed a hit film most of the people have an answer. Ask…
For decades, Jantar Mantar in Delhi has been an important location for public protests and…