Telugu

సక్సెస్ఫుల్ సినిమాకు మరో రెండు పార్ట్లు

న‌వీన్ పోలిశెట్టి టైటిల్ రోల్ పోషించిన ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. తాజాగా ఆ సినిమాకు మ‌రో రెండు భాగాలు రాబోతున్నాయని అంటున్నారు. డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్ఎస్‌జె ప్ర‌స్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు.

ADVERTISEMENT

ప్రస్తుతం ఆ డైరెక్టర్ చేస్తున్న ప్రాజెక్టు తరువాత వీటిని తెరకెక్కిస్తాడు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ఆ దర్శకుడు ఈ స్క్రిప్టుల పనిలో పడ్డాడు. ఈ సినిమా హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం రీమేక్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోయాయి. త్వ‌ర‌లో క‌న్న‌డ హ‌క్కులు కూడా అమ్ముడు కానున్నాయి.

లాక్ డౌన్ తరువాత ఆయా భాషలలో ఆ రీమేక్ సినిమాల అధికారిక ప్రకటన ఉంటుంది. ఇంకో విశేష‌మేమంటే, ఈ సినిమా జ‌పాన్ భాష‌లో అనువాద‌మ‌వుతోంది. సెప్టెంబ‌ర్ 11న అక్క‌డ విడుద‌ల‌వుతోంది. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన ఒక చిన్న సినిమాకు ఇది పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి.

మరోవైపు నవీన్ ప్రస్తుతం జాతిరత్నాలు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మహానటి వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ‘జాతిరత్నాలు’ సినిమాతో నిర్మాతగా మారారు. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మంచి క్రేజ్‌ నెలకొంది.

Share
Jhansi

Jhansi is a senior writer with extensive experience covering Telugu movies and the broader Indian cinema landscape. With a keen focus on U.S. updates related to Telugu people and Indians, as well as immigration & …

Published by

Recent Posts

AP Local Body Elections Put on Hold Across 100 Urban Bodies

The Andhra Pradesh State Election Commission has temporarily halted the election process in all 100…

18 minutes ago

The Paradise OTT: Dhumavati Fight Episode Trimmed

The Paradise has undergone a few changes for its OTT release, with the much-trolled Dhumavati…

38 minutes ago