
అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన దేశభక్తి చిత్రం “ఎయిర్ లిఫ్ట్” ధియేటిరికల్ ట్రైలర్ అందరి ప్రశంసలు అందుకుంటోంది. 1990, ఆగష్టు 2వ తేదీన జరిగిన సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమాను ఈ నెల 22వ తేదీన గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. అయితే ఇదే రోజున ‘అడల్ట్’ కామెడీ చిత్రం “క్యా కూల్ హైన్ హమ్ 3” సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమాలలో ఏ చిత్రానికి ఎక్కువ ఆదరణ దక్కనుందో యూ ట్యూబ్ లో నమోదైన క్లిక్స్ చెప్పకనే చెబుతున్నాయి. అడల్ట్ కామెడీ ట్రైలర్ విడుదలైన వెంటనే లక్షల క్లిక్స్ రాగా, ‘ఎయిర్ లిఫ్ట్’కు మాత్రం ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ట్రైలర్ ఆదరణలో అన్యాయం చేసిన ప్రేక్షకులు కనీసం సినిమాను వీక్షించడంలోనైనా న్యాయం చేస్తారని ఆశిద్దాం.
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…