Telugu

రామ్ రూటుకి అడ్డంగా అఖిల్?

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో మంచి జోరు మీద ఉన్న రామ్ తన తదుపరి చిత్రం రెడ్ కు శ్రీకారం చుట్టాడు. ముహూర్తం రోజునే వచ్చే ఏడాది ఏప్రిల్ 9న విడుదల చేస్తామని ప్రకటించేశాడు. నవంబర్ 16 నుండి చిత్రం షూటింగ్ మొదలు కాబోతుంది. అయితే ఇదే రోజున తన తదుపరి సినిమా విడుదల చెయ్యడానికి అఖిల్ అక్కినేని కూడా ప్రయత్నం చేస్తున్నాడట.

ఏప్రిల్ 9 సినిమా విడుదల రోజు గురువారం. మరుసటి రోజు గుడ్ ఫ్రైడే పబ్లిక్ హాలిడే. ఆ తరువాత వారాంతపు సెలవులు మాములే. అలాగే మొదటి వారంలో మరో హాలిడే (ఏప్రిల్ 14న) అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉండటంతో ఇది పర్ఫెక్ట్ డేట్. అయితే అఖిల్ వస్తే మాత్రం రామ్ తప్పుకోవాలేమో. అసలే అఖిల్ కు ఈ సారి అల్లు అరవింద్ సపోర్టు ఉంటుంది.

ADVERTISEMENT

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఒక పాట చిత్రీకరణ జరుపుకుంటుంది. అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ హీరోగా ప్రూవ్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమాలన్నీ ప్లాపులుగా మిగులుతున్నాయి. ఇప్పటివరకూ మూడు ప్లాపులు మూటగట్టుకున్నారు.

దానితో ఈ చిత్రం మీద భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. 2013లో ‘ఒంగోలు గిత్త’ తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్‌ సినిమా చేస్తున్నాడు. కేరీర్ లో ఒక్క హిట్ కూడా లేని టైం లో భాస్కర్ వంటి అవుట్ అఫ్ ది ఫామ్ దర్శకుడితో నటించడం అంటే సాహసం అనే అనుకోవాలి. ఈ సారైనా అఖిల్ సరైన హిట్ సాదిస్తాడేమో చూడాల్సి ఉంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

క్యాడర్ కుస్తీలు…అధినేతల భేటీలు

స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇన్నేళ్ల స్నేహాన్ని విరోధంగా మార్చేసింది. ఇరు పార్టీల మధ్య…

5 minutes ago

CSK Star Ruled Out for 3 Months: IPL 2027 in Doubt?

Chennai Super Kings (CSK) have suffered a setback ahead of IPL 2027, as Ayush Mhatre…

17 minutes ago