
బన్నీ వాసు నిర్మాణంలో అల్లు అరవింద్ సమర్పణలో రాబోతుంది. ఒకరకంగా మెగా కాంపౌండ్ లో అఖిల్ భవితవ్యం ఉందని చెప్పుకోవాలి. భాస్కర్ కొంత కాలంగా చెప్పుకోదగ్గ హిట్లు లేవు. అయినా ఆయన చెప్పిన కథ అల్లు అరవింద్, బన్నీ వాసు, అఖిల్ లకు బాగా నచ్చిందట. ఈ వారంలోనే నాగార్జునకు కథ వినిపించి ఒకే చేయించుకుంటే అధికారికంగా ప్రకటించేస్తారు. తొందర్లోనే ముహూర్తం పెట్టేసుకుని వేసవిలో షూటింగు మొదలు పెట్టాలని వారి అభిప్రాయంగా ఉందట.
నాగ చైతన్య కేరీర్ తొలి నాళ్లలో 100% లవ్ సినిమాతో బన్నీ వాసు, అల్లు అరవింద్ అతనికి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు అఖిల్ కూడా అదే ఆశతో ఉన్నారు. ఇటీవలే కాలంలో ఇదే బ్యానర్ లో విజయ్ దేవరకొండ ఒక 60 కోట్ల సినిమా ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ సినిమా మీద అక్కినేని అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే మూడు డిజాస్టర్లు ఇచ్చిన అఖిల్ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా గనుక తేడా జరిగితే ఆయన భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారే అవకాశాలు ఎక్కువ.
BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…