
అయితే అల్లు అరవింద్ మాత్రం అఖిల్ కి ఈ సినిమాతో హిట్ ఇచ్చే తీరతా అంటున్నారు. “సినిమా ఎప్పుడు వచ్చినా పండగ ఎడ్వాంటేజ్ ఉండాల్సిందే. అన్ని కుదిరితే దసరాకు వస్తుంది… ఒకవేళ అప్పటికి పరిస్థితులు కుదుటపడకపోతే… సంక్రాంతి వరకూ ఆగడానికి కూడా సిద్ధమే,” అంటున్నారట అల్లు అరవింద్.
2013లో ‘ఒంగోలు గిత్త’ తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కమ్ బ్యాక్ చేస్తున్నాడు. కేరీర్ లో ఒక్క హిట్ కూడా లేని టైం లో అఖిల్ భాస్కర్ వంటి అవుట్ అఫ్ ది ఫామ్ దర్శకుడితో నటించడం అంటే సాహసం అనే అనుకోవాలి. ఈ సారైనా అఖిల్ సరైన హిట్ సాదిస్తాడేమో చూడాల్సి ఉంది.
గీత ఆర్ట్స్ సంస్థకు చెందిన జీఏ2 పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. గత కొంత కాలంగా ఈ సంస్థ హిట్లకు చిరునామాగా మారింది. ఈ సంస్థ భలే భలే మగాడివోయ్ తో నానికి, ప్రతి రోజూ పండగే తో సాయి ధరమ్ తేజ్ కు, గీత గోవిందంతో విజయ్ దేవరకొండకు తమ కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చింది. దీనితో అక్కినేని అభిమానులు ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో టీడీపి, వైసీపీల మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకవైపు కింజారపు అచ్చన్నాయుడు తదితరులు, మరోవైపు ధర్మాన…
Big films may bring bigger collections, but their ticket price hikes could make life harder…